Sunitha vs Chinmayi:'మై బాడీ.. మై రైట్' వివాదం.. చిన్మయికి సింగర్ సునీత స్ట్రాంగ్ కౌంటర్!

Singer Sunitha vs Chinmayi: టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల మహిళల దుస్తులు, ఫెమినిజం, 'మై బాడీ.. మై రైట్' వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు సునీత ఉద్దేశాన్ని సమర్థిస్తే.. మరికొందరు ఆమె వ్యాఖ్యలు మహిళల హక్కులను తప్పుగా చూపించేలా ఉన్నాయని విమర్శించారు. ముఖ్యంగా ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ.. మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉందని అంగీకరించినప్పటికీ, ప్రస్తుతం ఉన్న సమాజ వాస్తవాలను కూడా విస్మరించకూడదని అన్నారు. "నా బాడీ.. నా రైట్" అని చెప్పే సమయంలో, సమాజంలో కొందరు మహిళలను చూసే తీరు కూడా ఒక వాస్తవమని పేర్కొన్నారు. మనం సమాజాన్ని ఒక్కరోజులో మార్చలేమని, అందుకే అవగాహనతో ముందుకు వెళ్లాలని చెప్పే ప్రయత్నమే తాను చేశానని ఆమె పేర్కొన్నారు.

Singer Sunitha vs Chinmayi

ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. మహిళల దుస్తుల గురించి మాట్లాడటం వల్ల అసలు సమస్య నుంచి దృష్టి మళ్లే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు దుస్తులు కారణం కాదని, మహిళల భద్రత విషయంలో బాధ్యతను మహిళలపైనే మోపేలా వ్యాఖ్యలు ఉండకూడదని చెప్పారు. సునీత పట్ల తనకు ఎంతో గౌరవం ఉన్నప్పటికీ, ఈ వ్యాఖ్యలు మహిళలకు మరింత నష్టం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

చిన్మయి వ్యాఖ్యలు వైరల్ కావడంతో సింగర్ సునీత కూడా వెంటనే స్పందించారు. తనపై చిన్మయికి ఎంత గౌరవం ఉందో, తనకూ చిన్మయిపై అంతే గౌరవం ఉందని ముందుగా స్పష్టం చేశారు. 'మీరు చెప్పిన 'మిస్ లీడ్ అయ్యే అవకాశం ఉంది' అనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. 'మై బాడీ.. మై రైట్' అనే నినాదం వెనుక ఉన్న అసలు భావన నాకు పూర్తిగా తెలుసు. ప్రతి వ్యక్తికి తన శరీరంపై పూర్తి హక్కు ఉంటుంది. ఎవరూ మరొకరి నియంత్రణలో ఉండకూడదు. ఈ అంశం చుట్టూ ఉన్న అన్ని కోణాల గురించి నాకు అవగాహన ఉంది'అని సునీత వివరించారు.

అయితే తాను "హిస్ ఐస్.. హిస్ రైట్" అని చెప్పిన మాట వెనుక ఉద్దేశాన్ని కూడా ఆమె వివరించారు. 'ప్రస్తుతం మనం ఉన్న సమాజ వాస్తవాన్ని మాత్రమే గుర్తు చేయాలని అనుకున్నాను. మనం కోరుకున్న స్థాయికి సమాజం ఇంకా చేరుకోలేదు. అందుకే ఆ వాస్తవాన్ని ప్రస్తావించాను. కానీ అది ఎవరి తప్పు ప్రవర్తనను సమర్థించడం కాదు'అని స్పష్టం చేశారు. అంతే, కానీ నా చేయి నా ఇష్టం అంటే వెళ్లి చేతులు విరగ్గొట్టేవాళ్లలో నేను ముందుంటాను. నేనెప్పుడు మిస్ లీడింగ్‌గా మాట్లాడటానికి ప్రయత్నించలేదు. మొత్తం వీడియో చూడండి. మీరు అర్థమయ్యే విషయం ఏంటంటే అనుభవించిన వాళ్లల్లో నేను కూడా ఉన్నా. నాకు అది ఓకే కాదు' అని సునీత చెప్పుకొచ్చింది.

ఈ వివాదంపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూనే ఉంది. కొందరు సునీత చెప్పిన అసలు ఉద్దేశాన్ని ఇప్పుడు అర్థం చేసుకోవాలని అభిప్రాయపడుతుండగా, మరికొందరు మొదట చేసిన వ్యాఖ్యలపై ఇంకా విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సునీత స్పష్టం చేసిన అంశం ఒక్కటే. మహిళల సమాన హక్కులు, గౌరవం, భద్రత విషయంలో తన అభిప్రాయం ఎప్పటికీ మారదని, మహిళలపై జరిగే దోపిడీ, వేధింపులు, వివక్షను తాను ఎప్పటికీ వ్యతిరేకిస్తానని మరోసారి స్పష్టంగా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X