డ్రగ్స్‌ అమ్ముతూ పట్టుబడ్డ 'సింగం 2' యాక్టర్.. రియల్ లైఫ్ లో కూడా అదే స్టైల్!

పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఇండియా లో డ్రగ్స్ సరఫరా అనేది అస్సలు తగ్గడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట డ్రగ్స్ సరఫరా చేస్తూ ప్రముఖులు కూడా వార్తల్లో నిలవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నైజీరియాకు చెందిన కొంతమంది ఇండియాలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు చాలా సార్లు కేసులు నమోదయ్యాయి. అయితే రీసెంట్ గా ఒక ప్రముఖ సినీ నటుడు కూడా డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అతనికి కొన్ని సినిమాలలో నటించడంతో సినీ ప్రముఖులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేవా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సింగం 2 లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా

సింగం 2 లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా

తమిళ బ్లాక్ బస్టర్ మూవీ సింగం 2లో నటించిన నైజీరియన్ నటుడు చాక్‌‌‌విమ్ మాల్విన్ ఆ సినిమాలోనే ఒక నిజమైన నైజీరియన్ దేశస్థుడిగా డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉంటాడు. ఇక రియల్ లైఫ్ కూడా మాల్విన్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదట అతను నటుడు కాదని అనుకున్నారాట.

రెడ్ హ్యాండెడ్ గా..

రెడ్ హ్యాండెడ్ గా..

మెడికల్ వీసాపై గత కొంతకాలంగా కెఆర్ పురం సమీపంలోని భట్టరహళ్లిలో ఉంటున్న చెక్వుమే మాల్విన్ (45)ను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 27 న కస్టమర్లకు డ్రగ్స్ విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా అతడిని రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. నిందితుడి నుండి రూ .7.5 లక్షల విలువైన 15 గ్రాముల MDMA మరియు 250 ML హషీష్ ఆయిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు

సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు

పోలీసులు ఆరా తీసేవరకు కూడా మాల్విన్ నటుడు అని అసలు నిజం చెప్పలేదట. అతను బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించాడు. ఇక ముంబై, చెన్నై, హైదరాబాద్ మరియు ఇతర నగరాలతో పాటుగా, ఇక్కడ ఉన్న శాండిల్‌వుడ్ చిత్ర పరిశ్రమతో అతని సంబంధాలను కలిగి ఉన్నట్లు అనుమానాలు కూడా వస్తున్నాయి అదే విషయంపై ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇండియాలోనే ఎక్కువ సినిమాలు

ఇండియాలోనే ఎక్కువ సినిమాలు

పోలీసుల కథనం ప్రకారం, నిందితుడు హిందీ, కన్నడ, తమిళం, తెలుగు మరియు మలయాళం భాషలతో సహా 20 భారతీయ సినిమాల్లో నటించాడు. అతను కన్నడ సినిమాలలో అన్నాబాండ్ మరియు పరమాత్మ అనే సినిమాలలో కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించాడు. ఇక నిందితుడు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నైజీరియాలో అలాగే ముంబైలో ఫిల్మ్ యాక్టింగ్ కోర్సు చేసారు. అతను మూడు నైజీరియన్ సినిమాల్లో కూడా నటించాడని పోలీసులు తెలిపారు.

Recommended Video

Sai Pallavi Heartfelt Speech About Nagarjuna In Love Story Success Meet
గుట్టు లాగుతున్న పోలీసులు

గుట్టు లాగుతున్న పోలీసులు

నిందితుడు త్వరగా డబ్బు సంపాదించటానికి డ్రగ్స్ విక్రయిస్తున్నాడని పోలీసులు చెప్పారు. ఇక నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్, 1985 కింద పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇక అతను పని చేసిన సినిమా ఇండస్ట్రీలలో ఎవరికైనా డ్రగ్స్ సరఫరా చేశాడా? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీసుకున్నారు. అయితే మెల్విన్‌తో సినీ పరిశ్రమకు చెందిన ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయి?అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X