పెద్ది థియేటర్‌లో ఒకే ఒక్కడు.. రాంచరణ్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరీ ఇంత దారుణంగానా?
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ది చిత్రం పాజిటివ్, నెగిటివ్ అంశాలతో ముందుకు వెళ్లున్నది. ఈ చిత్రం 4వ రోజుకు చేరుకొన్నప్పటికీ.. రోజు రోజుకు ఈ సినిమాపై భారీగా ప్రతికూలత ఏర్పడటం ఆందోళనకరంగా మారింది. ఈ సినిమాకు రాంచరణ్ నటన అతిపెద్ద బలంగా మారిన సమయంలో చిన్న చిన్న విషయాలను ఆధారంగా చేసుకొని నెటిజన్లు ట్రోల్ చేస్తున్న తీరు చూస్తుంటే.. ఈ మూవీపై ఏదో కక్ష కట్టుకొని నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారా? అనేది సోషల్ మీడియాలో స్పష్టమవుతున్నది. అయితే తాజాగా ఓ థియేటర్‌లో ఒక్కడిన ఉన్నాను అంటూ ప్రేక్షకుడు షేర్ చేసిన వీడియో వైరల్ అవుతున్నది. ఈ వీడియో మీరే ఓ సారి లుక్ వేయండి..
మెగా హీరోలకు దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ సినిమా రిలీజైనా తొలి రోజు రికార్డు స్థాయిలో ఫుట్‌ఫాల్స్ నమోదు అవుతుంటాయి. అయితే పెద్ది సినిమా విషయంలో ఓవర్సీస్‌లో పెద్దగా స్పందన లేకపోవడం వెనుక కారణం ఏమిటనే విషయం ఇప్పడు భారీ చర్చకు దారి తీసింది. స్టార్ హీరోల సినిమాలకు పేలవంగా ఉంటే .. రానున్న రోజుల్లో థియేట్రికల్ రన్ పరిస్థితి ఏమిటి? అని ముక్కున వేలేసుకొంటున్నారు.

ఖతర్ దేశంలో తాను కొన్న టికెట్‌ను చూపిస్తూ.. చూడండి. పెద్ది సినిమాకు వచ్చాను. ఒక్కలు కూడా లేరు. ఇప్పడే షో స్టార్ట్ అయింది. అడ్వర్టయిజ్‌మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకో 5 నిమిషాల్లో సినిమా స్టార్ట్ అవుతుంది. థియేటర్‌లోపల చూడండి. ఒక్కరు కూడా లేరు. నేను ఒక్కడినే థియేటర్‌లో ఉన్నా. ఇది ఖతర్‌లో పెద్ది సినిమా థియేటర్ వాతావరణం. ఈ రోజే ఫస్ట్ షో. ఈ రోజు ఒక్క పోస్టర్ కూడా పెట్టలేదు. నా ఒక్కడి కోసమే సినిమాను ప్లే చేయడం అంటే.. ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్ అంటూ ఓ ప్రేక్షకుడు వీడియోను షేర్ చేశారు. అయితే ఈ వీడియోలో ఉన్నది నిజమేనా? ఉద్దేశపూర్వకంగా ఏమైనా క్రియేట్ చేశారా? ఎన్టీఆర్ పేరుతో, ఆయన నటించిన డ్రాగన్ సినిమా పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. అయితే ఈ వీడియోలో ఎంత నిజమున్నదనేది వేచి చూడాల్సిందే.
ఒకవేళ ఇదే నిజమైతే.. గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ ఉన్న రాంచరణ్ మూవీకి ఈ పరిస్థితి అయితే.. మిడిల్ రేంజ్, లో రేంజ్ హీరోల సినిమాల పరిస్థితిని ఊహించగలమా? 350 కోట్ల రూపాయలతో సినిమా నిర్మించామని చెప్పిన చిత్ర యూనిట్.. కనీసం థియేటర్ వద్ద పోస్టర్ పెట్టలేకపోవడం ఎవరి వైఫల్యం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఖతర లాంటి దేశంలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. మిగితా దేశాల్లో పరిస్థితి ఏంటి? ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను సరిగా క్యాష్ చేసుకోవడంలో విఫలమయ్యారా? అనేది ఇప్పుడు అభిమానులను వెంటాడుతున్న ప్రశ్న.
పెద్ది సినిమా విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 230 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 3 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లను నమోదు చేసిందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం తొలి వారాంతం తర్వాత థియేటర్లలో నిలబడుతుందా? అనే విషయం గురించి ప్రేక్షకులు, సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. సోమవారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడగలిగితే.. రాంచరణ్ మూవీకి పాజిటివ్‌గా మారే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications