చిరంజీవి మాజీ అల్లుడు మరణంపై రూమర్లు.. శిరీష్ భరద్వాజ్ మరణంపై తల్లి క్లారిటి!

గత నెలలో మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ కన్నుమూయడం తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఊపిరితిత్తులు సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే శీరీష్ మరణించిన తర్వాత ఆయన మృతిపై అనేక రూమర్లు వచ్చాయి. ఆ రూమర్లపై తన తల్లి మీడియాతో మాట్లాడుతూ.. క్లారిటీ ఇచ్చారు. అలాగే శిరీష్ చిన్న వయసులో మరణించడంపై కారణాలు స్పష్టం చేశారు. శిరీష్ తల్లి చెప్పిన వివరాల్లోకి వెళితే..

2007లో శ్రీజ - శిరీష్‌లు పెద్దలను ఎదిరించి మరి మీడియా, పోలీసుల సమక్షంలో ఒక్కటయ్యారు. అప్పట్లో వీరి వ్యవహారం టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. 2014లో శ్రీజ- శిరీష్ దంపతులకు ఒక బిడ్డ పుట్టింది. ఈ క్రమంలో తనను శిరీష్ వేధిస్తున్నాడని, అదనపు కట్నం కోసం చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ శ్రీజ ఆరోపించడం అంతే వివాదాస్పదమైంది.

sirish bharadwaj mother made sensational comments on mega star Chiranjeevi family

భార్యాభర్తల మధ్య విభేదాల నేపథ్యంలో శిరీష్‌కు శ్రీజ విడాకులు ఇచ్చి తిరిగి పుట్టింటికి చేరుకున్నారు. శ్రీజ నుంచి విడిపోయాక కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న శిరీష్ భరద్వాజ్ 2019లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులు చెన్నైలో స్థిరపడినట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండే శిరీష్ భారతీయ జనతా పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు.

మెగాస్టార్ చిరంజీవికి అల్లుడై, తర్వాత బీజేపీలో చేరి ప్రధాని నరేంద్ర మోడీ అంతటి వ్యక్తితో ప్రశంసలు పొందిన శిరీష్ ఇంత చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో అంతా షాక్ అవుతున్నారు. జనం పరిస్ధితే ఇలా ఉంటే.. శిరీష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పరిస్ధితి వర్ణనాతీతం. ఆయన మరణం తర్వాత శిరీష్ భరద్వాజ్ ఇంటి వద్దకు మీడియా ప్రతినిధులు క్యూకడుతున్నారు. ఆయన తల్లి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ శ్రీజతో శిరీష్ పెళ్లి, విడాకులు.. అతని రెండో పెళ్లి, అనారోగ్యం తదితర అంశాలపై కీలక విషయాలు పంచుకుంటున్నారు.

తాజాగా ఓ ఛానెల్‌తో ఆమె మాట్లాడుతూ.. శిరీష్ తాగుడుకు బానిసై మరణించినట్లుగా వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. లివర్, లంగ్స్ పాడవటంతో తన బిడ్డ మరణించినట్లుగా అంతా అనుకుంటున్నారని, కానీ గుండెపోటుతో శిరీష్ ప్రాణాలు కోల్పోయాడని ఆమె చెప్పారు. దుబాయ్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుని హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అతని ఆరోగ్యం పాడైందని, వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేర్చామని.. నెలరోజుల పాటు హాస్పిటల్‌లోనే ఉన్నాడని కార్డియాక్ అరెస్ట్‌తో మరణించాడని ఆమె తెలిపారు.

తన కొడుకుపై వస్తున్న రూమర్లను, అవాస్తవాలను తల్లి పలు మీడియా సంస్థలతో పంచుకొంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీజ, శిరీష్‌కు పుట్టిన బిడ్డ మా వారసత్వమే అని అన్నారు. తన కొడుకు దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నాం. ఇంకా సంఘటనను మరిచిపోలేకపోతున్నాం అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X