సిరివెన్నెల: హారర్ మూవీతో భయపెడుతున్న రాజేంద్రప్రసాద్ మనవరాలు
'మహానటి' చిత్రంలో బాల సావిత్రిగా అందరినీ మెప్పించిన సాయి తేజస్విని ప్రధాన పాత్రలో 'సిరివెన్నెల' అనే చిత్రం రాబోతోంది. ఏఎన్‌బి కోర్డినేటర్స్, శాంతి టెలీఫిలిమ్స్ బ్యానర్‌పై కమల్ బోరా, ఏ ఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాలనటి సాయి తేజస్విని మెయిన్ రోల్ చేస్తుండగా.. ప్రియమణి ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. బాహుబలి ఫేమ్ కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బాలనటి సాయి తేజస్విని గురించి మాట్లాడుతూ... మీ తాతయ్య(రాజేంద్రప్రసాద్) నవ్వించేవారు నువ్వు(సాయి తేజస్విని) భయపెడుతున్నావు. మహానటితో స్టార్ట్ చేశావ్. మన సక్సెస్ కన్నా మన పిల్లల సక్సెస్ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ప్రియమణి సతిసావిత్రిలాగా అటు మోడ్రన్, ఇటు ట్రెడిషనల్ ఏపాత్ర కైనా సూట్ అవుతుంది. ప్రస్తుతం యాక్షన్ చిత్రం చెయ్యడం చాలా బావుంది. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అన్నారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...నేను ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణమైన భాషాగారికి కృతజ్ఞతలు. దర్శకుడు ప్రకాష్ సినిమా జయ్ జయ్ గణేషా అనే పాటతో ప్రారంభించారు. అంతా మంచే జరుగుతుంది. ప్రతి వినాయకచవితికి పెట్టుకుని వినే పాట అవుతుంది. మా మనవరాలు సాయి తేజస్విని గురించి నేను చెప్పకూడదు మీరే ఈ సినిమా చూసి ఎలా నటించిందో చెప్పండి అని అన్నారు.
సాంకేతిక వర్గం
నిర్మాతలు - కమల్ బోరా, ఏ.ఎన్. భాషా, ఏ.రామసీతా
రచన, దర్శకత్వం - ప్రకాష్ పులిజాల
మ్యూజిక్ - ఏఎన్ బి కోర్డినేటర్స్ మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ
సాంగ్స్ కంపోజింగ్ - మంత్ర ఆనంద్, కమ్రాన్
డిఓపి - కళ్యాణ్ సమి
ఎడిటర్ - నాగేశ్వర్ రెడ్డి
లిరిక్స్ - శ్రీరామ్ తపశ్వీ
కొరియోగ్రాఫర్ - ఛార్లీ
ఫైట్స్ - రామకృష్ణ
ప్రొడక్షన్ కంట్రోలర్ - యోగానంద్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - మోహన్ పరుచూరి


Click it and Unblock the Notifications











