‘సీత’ సినిమాను ఎవడు ఆపుతాడో చూస్తా... వార్నింగులకు భయపడని తేజ!

బెల్లంకొండ శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరో హీరోయిన్లుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'సీత‌'. మే 24న ఈ మూవీ రిలీజవుతున్న నేపథ్యంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి 'సీత' అనే టైటిల్ పెట్టడంపై భారతీయ జనతా యువ మోర్చా(బీజెవైఎం) అభ్యంతరం వ్యక్తం చేసింది.

'సీత' టైటిల్ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని.... ఈ మూవీ టైటిల్ మార్చడంతో పాటు రిలీజ్ చేయడానికి ముందు హిందూ సోదరులకు ఈ సినిమా చూపించాలని, లేనిచో రిలీజ్ అడ్డుకుంటామని, థియేటర్ల వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.

 Sita Movie Controversy: Director Teja Strong Counter To BJYM

ఈ హెచ్చరికలపై దర్శకుడు తేజ స్పందించారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని తెలిపారు. సీత టైటిల్ 'సీత' అని కాకుండా 'శూర్పణక' అని పెట్టాలా? అంటూ ఎదురు ప్రశ్నించారు. సెన్సార్ కూడా పూర్తయింది, టైటిల్ మార్చాల్సిన అవసరం లేదన్నారు. మే 24 ఉదయం 11 గంటలకు ఈ చిత్రం విడుదలవుతోంది.. ఆపడానికి ఎవడొస్తాడో చూస్తా అంటూ తేజ రివర్స్ వార్నింగ్ ఇచ్చారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో ఎకె ఎంటర్టెన్మెంట్స్ వారు నిర్మించిన ఈ చిత్రంలో ఇంకా మనారా చోప్రా, సోనూ సూద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. RX 100 చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ 'సీత'లో స్పెషల్ సాంగులో కనిపించబోతోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X