twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సీత’ బిజినెస్ హాట్ టాపిక్.. కాజల్ గ్లామర్ ఎఫెక్టా? తేజ టాలెంటా?

    |

    బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ ప్రధాన పాత్రల్లో తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సీత'. మే 24న ఈ మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏరియాల్లో బిజినెస్ పూర్తయింది. అంచనా వేసిన దానికంటే మంచి వ్యాపారమే జరిగినట్లు తెలుస్తోంది.

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఏపి, తెలంగాణతో పాటు రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 12.60 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. నైజాం ఏరియా రైట్స్ రూ. 4 కోట్లు, సీడెడ్ రూ. 2.1 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.35 కోట్లు, ఈస్ట్ గోదావిర రూ. 1 కోటి, కృష్ణ రూ. 90 లక్షలు, గుంటూరు రూ. 1.10 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 80 లక్షలు, నెల్లూరు రూ. 45 లక్షలు, రెస్టాఫ్ ఇండియా రూ. 90 లక్షలకు అమ్ముడైనట్లు సమాచారం.

    Sita Pre-Release Business Rs. 12.60 Cr

    ఈ చిత్రాకి ఇంత మంచి బిజినెస్ కావడానికి ప్రధాన కారణం కాజల్ స్టార్ ఇమేజ్, ఆమె గ్లామర్‌కు ఉన్న డిమాండే అనే వాదన వినిపిస్తోంది. తేజ ఇంతకు ముందు 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో హిట్టు కొట్టడం కూడా బిజినెస్ పరంగా కలిసొచ్చింది. అయితే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇమేజ్ బిజినెస్ మీద అంతగా లేదని అంటున్నారు.

    బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా 'సీత' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సోనూ సూద్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    కాజల్ అగర్వాల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇంతకు ముందు ఈ ఇద్దరూ కవచం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇపుడు అదే హీరోతో కాజల్ రెండోసారి నటిస్తోంది.

    English summary
    Bellamkonda Sreenivas, Kajal starrer 'Sita' directed by Teja is gearing for a grand release on the May 24th. The movie All India theatrical rights of the film are valued for 12.60 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X