Sita Ramam Pre Release Event: ప్రాజెక్ట్ K ఎప్పుడు వస్తుందంటే.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పీచ్

దుల్కర్ సల్మాన్ నటించిన సీతా రామం సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం నిర్వహించారు. ఇక వేడుకకు ప్రభాస్ ప్రత్యెక అతిధిగా వచ్చారు. వేడుకకు మరో గెస్ట్ గా వచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ తన మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. వేడుకకు ముఖ్యఅతిథిగా వచ్చిన ప్రభాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే ఈ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి గారు అంటే నాకు చాలా ఇష్టమైన దర్శకులు. నేను ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేసినప్పుడు ఆయన నాతో ప్రత్యేకంగా వచ్చి మాట్లాడారు. ఆయన అందాల రాక్షసి సినిమాను నేను థియేటర్లో వెళ్లి చూశాను. అప్పటికి నేను ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్లు మాత్రమే. ఆ సినిమా మేకింగ్ నాకు ఎంతో నచ్చింది. అప్పట్లో అందరూ దాని గురించి మాట్లాడుకున్నారు. ఇక సీతారామం సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించారు.

Sita Ramam Pre Release Event Director nag ashwim speech

ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో పూర్తిగా కనిపిస్తాడు. నేను ఫస్ట్ వెర్షన్ చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది. మహానటి సినిమాలో అతను కేవలం ఒక భాగం వరకు మాత్రమే నటించాడు. కానీ ఈ సినిమాలో మాత్రం అతను పూర్తిస్థాయిలో మిమ్మల్ని ఆకట్టుకుంటాడు. అలాగే మృనల్ ఠాగూర్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. ఇక సుమంత్ పాత్ర కూడా చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రాజెక్ట్ K ఎప్పుడు వస్తుంది అనే విషయం గురించి చెప్పాలి అంటే 4 ప్లానెట్స్ వచ్చినప్పుడు వస్తుంది దాని గురించి చెప్పాలి అంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఇక సీతారామన్ సినిమా కమర్షియల్ కు భిన్నంగా తరకెక్కింది సినిమాలో పాటలు నిజంగా అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనే నమ్మకంతో ఉన్నాను అంటూ నాగ్ అశ్విన్ తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X