Sita Ramam Pre Release Event: ఈ సినిమా నాకు చాలా స్పెషల్.. చూస్తే మీరే కనెక్ట్ అవుతారు: దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ నటించిన సీతా రామం సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం నిర్వహించారు. వేడుకకు ప్రభాస్ ప్రత్యేక అతిధిగా వచ్చారు. ఇక వేడుకలో సినిమా హీరో దుల్కర్ సల్మాన్ తన మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ముందుగా ఈవెంట్ కు వచ్చిన ప్రభాస్ గారికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన ఒక గ్లోబల్ డార్లింగ్ స్టార్. నేను ప్రాజెక్టు K లో కొన్ని సెట్స్ చూశాను. తప్పకుండా ఆ సినిమా ఇండియన్ సినిమాను చేంజ్ చేస్తుంది అని నమ్మకంగా చెప్పగలను. ఆ సినిమా కోసం మీ అందరిలాగే నేను కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను.

ఇక సినిమా గురించి చెప్పాలి అంటే సీతారామం కథతో నేను చాలా కాలం పాటు ట్రావెల్ అయ్యాను. వైజయంతి లో ఉన్న అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా నిర్మాత స్వప్న దత్ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. నిజంగా ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడ్డారు. అందరూ నన్ను నేను చాలా స్మార్ట్ అంటూ ఉంటాను కానీ అశ్వినీ దత్ గారు మోస్ట్ చార్మ్ పర్సన్. ఆయన ఎల్లప్పుడూ తన నవ్వుతూనే ఒక మంచి సపోర్ట్ ఇస్తారు.

Sita Ramam Pre Release Event Dulquer Salmaan speech

డైరెక్టర్ హను రాఘవపూడి గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఒక నిజమైన ఆర్టిస్ట్. ఆయన మనసులో అనుకుంటే ఏదైనా కూడా చాలా అందంగా తెరపైకి తీసుకు రాగలరు. ఆయన డ్రీమ్ లో నన్ను ఇలా చూపించడం ఎంతగానో నచ్చింది. సినిమా మేకింగ్ కోసం ఆయన చూపించిన శ్రద్ధ నాకు చాలా బాగా నచ్చింది. తప్పకుండా ఆగస్టు 5 తర్వాత ఆయన ఒక వండర్ క్రియేట్ చేయబోతున్నట్లు అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో నేను చేసిన పాత్ర కూడా నాకు చాలా స్పెషల్. నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు కూడా అదే ఫీల్ అవుతారు.

ఈ సినిమాలో నటించిన సీతామాలక్ష్మి పాత్రలో మృనల్ ని తప్పితే మరొకరిని ఊహించలేను. ఇక మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించిన సుమంత్ నాకు ఒక బ్రదర్ లాగా అయిపోయారు. ఆయన ఒక మంచి టాలెంటెడ్ జెంటిల్మెన్ అని చెప్పవచ్చు. తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమాలో అందరినీ నవ్వించగలడు. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని చెప్పగలను. మొదటి రోజు ఈ సినిమా చూసిన తర్వాత ఎవరు కూడా నిరుత్సాహం చెందారు.. ఇది నా హామీ అంటూ దుల్కర్ సల్మాన్ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X