Sita Ramam Pre Release Event: ఇది పక్కా థియేటర్ ఫిల్మ్ అంటూ మొదటి టికెట్ కొన్న ప్రభాస్!
దుల్కర్ సల్మాన్ నటించిన సీతా రామం సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం నిర్వహించారు. వేడుకకు ప్రభాస్ ప్రత్యేక అతిధిగా వచ్చారు. ఇక వేడుకలో ప్రభాస్ తన మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రభాస్ మాట్లాడుతూ.. నిర్మాత స్వప్న దత్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అని తెలిసింది. నిజంగా ఆమె ప్రత్యేకంగా పిలవడం వల్ల నేను ఈ వేడుకకు వచ్చాను. ట్రైలర్ అయితే నేను ముందే చూసాను. నాకు అప్పటి నుంచే చాలా బాగా నచ్చింది. దుల్కర్ సల్మాన్ కంట్రీ లోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. తెలుగులో మహానటి లో నువ్వు నటించిన విధానం చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ సినిమాలో కూడా అలానే కనిపిస్తున్నావు. ఇక సీత పాత్రలో నటించిన మృనల్ కూడా చాలా బాగా నటించారు.

ఈ సినిమాలో ఒక యుద్ధం కూడా ఉంది అని తెలుసుకున్నాను. ఇది కేవలం ఒక లవ్ స్టోరీ మాత్రమే కాదు. ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుసుకున్నాను. రష్యా లో కూడా షూట్ చేశారని తెలిసింది. రష్యాలో షూట్ చేసిన మొదటి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. ఇక డైరెక్టర్ హను రాఘవపూడి గారి సినిమాలను ఇంతకుముందు చూశాను. ఆయన చాలా మంచి దర్శకులు. ఆయన ఈ సినిమాను ఒక పోయెట్రీలా తీశారు. ఇక సుమంత్ డార్లింగ్ ఈ సినిమాలో నటించారు అని తెలియగానే స్పెషల్ క్యారెక్టర్ అని అనిపిస్తోంది.

నిర్మాత అశ్విని దత్ గారు మన ఇండస్ట్రీలో ఉండడం చాలా అదృష్టం. ఆయన ఎన్నో పెద్ద సినిమాలు తీసి ఇలాంటి మంచి లవ్ స్టోరీలను కూడా తెరపై తీసుకు వస్తూ ఉండడం గర్వకారణమని చెప్పాలి. ఇక ఈ సినిమా విజువల్స్ చూసిన తర్వాత తప్పకుండా థియేటర్లోనే చూడాలి అని అనిపించింది. ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తమా? అలాగే ఓటీటీ ఉందని సినిమా థియేటర్స్ కు వెళ్లడం మానేస్తమా? మా సినిమాకు థియేటర్ గుడి.

అది మీరు ఇచ్చిందే. ఇది పక్కా థియేటర్ ఫిల్మ్. దర్శకుడు ఆ విధంగా ఈ సినిమాను తెరపైకి తీసుకు వచ్చారు. అలాగే నటీనటులు కూడా అద్భుతంగా నటించారు.. అని ప్రభాస్ మాట్లాడారు. అలాగే ఈ సినిమా మొదటి టికెట్ ను ప్రభాస్ 100 రూపాయలకు కొనుగోలు చేశారు.


Click it and Unblock the Notifications











