Sita Ramam Twitter Review క్లాసికల్ లవ్ స్టోరి.. హను రాఘవపూడి టేకింగ్ సూపర్.. కానీ అదొక్కటే మైనస్!
సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్ జంటగా రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం టీజర్లు, ట్రైలర్లు భారీ అంచనాలను నింపాయి. ఈ సినిమా గురించి నెటిజన్లు, ప్రేక్షకులు ట్విట్టర్‌లో వెల్లడించిన వివరాలు మీ కోసం..
Recommended Video

కథ, కథనాలు కాస్త స్లోగా
సీతారామం సినిమా కథ, కథనాలు కాస్త స్లోగా ఉన్నాయి. హను రాఘవపూడి తీసిన సినిమాల్లో ది బెస్ట్. సెకండాఫ్‌లో ఎమోషన్స్ బాగున్నాయి. సెకండాఫ్‌లో మంచి కాన్‌ఫ్లిక్ట్ పెట్టాడు. ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. విజువల్‌గా ఫ్రేమ్స్ బాగున్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
సినిమా బ్యూటీఫుల్‌గా
సీతా రామం సినిమా బ్యూటీఫుల్‌గా మొదలవుతుంది. దుల్కర్, మృణాల్ కలిసే సమయానికి నెమ్మదిగా కథ సాగుతుంది.

క్లాస్ సినిమా
సీతారామం క్లాస్ సినిమా. అందమైన ప్రేమకథ. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. పాటల సాహిత్యం, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్ క్లాస్, నెమ్మదిగా కథ సాగుతుంది. ఫస్ట్ 30 నిమిషాలు ఆర్డినరీగా ఉంది అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
ప్రేమ కథలు వెండితెరపై
దుల్కర్ సల్మాన్ రొమాంటిక్ సినిమాలకు బ్రేక్ చెప్పాలనుకొంటే.. ఒకే. కానీ చిన్న బ్రేక్ తీసుకోవాలని నా సలహా. సీతారామం సినిమా నటీనటుల ఫెర్మార్సెన్స్‌తో కేక పెట్టించింది. ఇలాంటి ప్రేమ కథలు వెండితెరపై బాగా చెప్పాలి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
అందమైన, పోయెటిక్ స్టోరి.
సీతారామం అందమైన, పోయెటిక్ స్టోరి. హను రాఘవపూడి అందించిన కథ అద్భుతంగా ఉంది. సెకండాఫ్‌లో మృణాల్, దుల్కర్ ఫెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సాంగ్స్, బీజీఎం, డైలాగ్స్, ఎమోషన్స్ బాగా పండాయి. ఫస్టాఫ్, సెకండాఫ్ చాలా బాగున్నాయి. బాక్సాఫీస్ వద్ద రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
కరకాల కష్టాలను దాటుకొంటూ
సీతారామం వందల మంది టెక్నిషియన్స్ రెండేళ్ల కష్టానికి ప్రతిఫలం. రకరకాల కష్టాలను దాటుకొంటూ ఈ సినిమాను రూపొందించాం. కొత్త అనుభూతిని పంచడానికి ఇది మా చిన్న సాక్ష్యం అని ట్రైలర్‌ను హను రాఘవపూడి షేర్ చేశాడు.
సినిమా కొత్త అనుభూతిని
ఇప్పుడే అమెరికాలో సీతారామం ప్రీమియర్ చూశాను. ఈ సినిమా మెమొరీస్ చాలా కాలం మిమ్మల్ని వెంటాడుతుంటాయి. దుల్కర్, మృణాల్ కెమిస్ట్రీ బాగుంది. రష్మిక మందన్న క్యూట్‌గా ఉంది. సాంగ్స్, విజువల్స్ ప్రత్యేక ఆకర్షణ. సినిమా కొత్త అనుభూతిని అందిస్తుంది. అది చాలా రోజులు మిమ్మల్ని వెంటాడుతుంటుంది అని నెటిజన్ అన్నారు.
సీతారామం క్లాసీ టేకింగ్
సీతారామం క్లాసీ టేకింగ్. టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. దుల్కర్, మృణాల్ ఎంపిక బాగుంది. సినిమా కాస్త స్లోగా సాగుతుంది. కానీ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











