ఈవారం కాదు.. కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ ‘సీత’ రిలీజ్ డేట్ మారింది
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్‌లో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'సీత'. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ డేట్ మారింది.
చిత్ర బృందం నుంచి అందిన సమాచారం ప్రకారం... ముందుగా అనుకున్న దాని కంటే నెల రోజులు ఆలస్యంగా మే 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కవచం మూవీ తర్వాత శ్రీనివాస్, కాజల్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది.

ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. హీరోయిన్ కోణంలో సినిమా కథ ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది. RX 100 చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ 'సీత'లో స్పెషల్ సాంగులో కనిపించబోతోంది.
తేజ దర్శకత్వంలో వచ్చే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంటాయి. 'సీత' మూవీలో కూడా ఈ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు. అనూప్ రూబెన్స్ అందించిన ట్యూన్స్‌కు అనుగుణంగా పాయల్ సెక్సీ డాన్స్ ప్రదర్శన ప్రేక్షకులను అలరించబోతోంది. .
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా 'సీత' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సోనూ సూద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











