దేవీ శ్రీ ప్రసాద్‌తో మహేష్ కూతురు డ్యాన్స్.. కేక పుట్టించిన వీడియో
మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఎన్టర్జీ లెవెల్ గురించి కొత్తగా చెప్పుకోనవసరం లేదు. బీట్ స్టార్టయిందంటే ఆయనలో జోష్ పరుగులు పెడుతుంది. ప్రస్తుతం మహర్షి సినిమాకు దేవీ శ్రీ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూట్ ఇటీవల గోవాలో జరిగింది. ఈ సందర్బంగా మహేష్ ఫ్యామిలీ గోవాలో సందడి చేసింది. అక్కడే ఉన్న దేవీ శ్రీ ప్రసాద్... మహేష్ ఫ్యామిలీ కిడ్స్‌తో ఎంజాయ్ చేశారు.

గోవాలోని హోటల్ రూమ్‌లో దేవీశ్రీ ప్రసాద్, సితార కలిసి శ్రీమంతుడు సినిమాలోని పాటకు లయబద్ధంగా డ్యాన్స్ చేశారు. చారుశీల అంటూ దేవీ శ్రీ పాట అందుకోగా మరో చిన్నారితో కలిసి సితార స్టెప్పులు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.
సితార వేసవి సెలవులను తండ్రి మహేష్ బాబు షూటింగ్‌లో ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఈ మధ్యలో సితార వీడియోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. సితార ఇటీవల బాహుబలి పాటకు చేసిన డ్యాన్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











