Don't Miss!
- News
కడప నుంచి హైదరాబాద్ చేరుకున్న 3 ట్రంకు పెట్టెలు!
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Finance
womens ipl: ఒకే ఆటలో అంబానీ-అదానీ.. పిచ్ లో నిలిచేదెవరు..? చివరికి గెలిచేదెవరు..?
- Sports
4 వన్డేల్లో 2 సెంచరీలు.. ఒక డబుల్ సెంచరీ.. రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్!
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
VD12 అదిరిపోయే లుక్‌తో విజయ్ దేవరకొండ.. జెర్సీ డైరెక్టర్‌తో స్పై థ్రిల్లర్.. నిర్మాతలు ఎవరంటే?
అర్జున్ రెడ్డి, గీత గోవిందం, పెళ్లి చూపులు వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకొని తిరుగులేని గుర్తింపు తెచ్చుకొన్న విజయ్ దేవరకొండ తాజాగా యువ దర్శకుడు, జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో జతకట్టాడు. ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందిస్తున్నది. దర్శకుడు గౌతమ్‌తో సితారకు రెండో సినిమా కాగా, విజయ్ దేవరకొండతో తొలి చిత్రం కావడం గమనార్హం. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఎన్నో నాణ్యమైన చిత్రాలను అందిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మొదటిసారి విజయ్‌తో జత కట్టడంతో ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
VD12 పేర్కొంటున్న ఇంకా పేరు పెట్టని చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ దేవరకొండ కెరీర్‌లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నిర్మాత ఎస్ నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
గతంలో జెర్సీ చిత్రం కోసం గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ జతకట్టారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ఈ చిత్రం జాతీయ అవార్డుతోపాటు సినీ విమర్శకుల ప్రశంసల అందుకొన్న సంగతి తెలిసిందే. జెర్సీ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించడం తెలిసిందే.

తెలుగు, హిందీ పరిశ్రమలలో ప్రతిభగల దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి నిరూపించుకున్నారు. 2019లో ఆయన దర్శకత్వంలో వచ్చిన 'జెర్సీ' సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఎంతో ప్రతిభగల గౌతమ్ ఇప్పుడు మరో ప్రతిభావంతుడు, యువ సంచలనం విజయ్ దేవరకొండతో చేతులు కలిపారు. వీరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ అంచనాలను అధిగమించి, అందరినీ అలరించే చిత్రం అందిస్తామని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ఇది భూమి బద్దలై పోయేది, అత్యంత భారీగా ఉంటుందని తాము చెప్పట్లేదు.. కానీ అద్భుతమైన విషయం అని మాత్రం చెప్పగలమని నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. విజయ్ దేవరకొండలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాను, తప్పకుండా అందర్ని ఆకట్టుకొనే కథ ఇది అని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెలిపారు.
విజయ్ దేవరకొండ, గౌతమ్ కాంబినేషన్‌లో వచ్చే సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ నిర్మాతలు అదిరిపోయే లుక్‌తో కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ఓ వ్యక్తి పోలీసు దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి గూఢచారి మాదిరిగా కనిపించాడు. పోస్టర్ మీద "I don't know where I belong, to tell you whom I betrayed - Anonymous Spy" అని ఉండటం ఆసక్తిని రేపింది. పోస్టర్ చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్ అనే విషయం స్పష్టమైంది. సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్‌ను ఆవిష్కరించడం ఆసక్తిని రేపింది.