Sitara Ghattamaneni: "మా నాన్నకు అలా చేస్తే అస్సలే నచ్చదు.. అందుకే ఆరోజు మా అత్తతో అలా బిహేవ్ చేశాడు"
సూపర్ స్టార్ కృష్ణ మనుమరాలు, హీరో మహేశ్ బాబు, హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ ల గారాల పట్టి సితార గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పుట్టినప్పటి నుంచి ఆమె ఏం చేసినా వైరల్ గా మారుతుంది. ఆమె ఎక్కడకైననా వెళ్లినా, ఏమైనా చేసిన ఆ ఫొటోలు క్షణాల్లో నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ క్యూట్ పాపాయి ఈమధ్యే టీనేజ్ లోకి అడుగు పెట్టింది.
కుటుంబం గురించి, సినిమాల గురించి సొంతంగా మాట్లాడుతూ ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ క్యూట్ పాపాయి.. తన తండ్రి గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. అలాగే ఇటీవలే తన అత్త మంజుల ఘట్టమనేని, తన తండ్రి మహేష్ బాబులకు సంబంధించిన వైరల్ వీడియోపై కూడా స్పందించింది. తన తండ్రి అత్తతో అలా ఎందుకు బిహేవ్ చేశాడో వివరించింది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సితార ఘట్టమనేని చూస్తుండగానే.. చాలా పెద్దది అయిపోతుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సినిమాలపై ఉన్న ఆసక్తి గురించి చెబుతూ వస్తోంది. అలాగే తన ఫ్యామిలీ, చదువు అన్నింటికి సంబంధించిన విషయాలను వివరిస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడే యాంకర్లు అనేక ప్రశ్నలు అడిగారు. వాళ్లు అడిగిన ప్రతీ ప్రశ్నకు సితార చక్కగా సమాధానం చెప్పింది. ముఖ్యంగా ఇటీవలే హైదరాబాద్ లో ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు మహేష్ బాబు.

భార్య, సోదరీమణులతో కలిసి అక్కడ సందడి చేశారు. అక్కడే మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని తన తమ్ముడిని చూడగానే.. ఆయన హెయిర్ ముట్టింది. అలా చెరిపేస్తూ.. సరదాగా ఉంది. అయితే మహేష్ బాబు మాత్రం జుట్టును ముట్టుకోనివ్వకుండా పక్కకు జరుగుతూ కాసేపు ఆటాడించాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియో సమయంలో.. మీ అత్త ఏం మాట్లాడింది, ఏం జరగిందని సితారను అడిగారు యాంకర్లు.
అప్పుడు చాలా క్యూట్ గా నవ్విన సితార... తన తండ్రి మహేష్ బాబుకు ఎవరైనా ఆయన జుట్టు ముడితే అస్సలే నచ్చదని చెప్పింది. అందుకే తన అత్త మంజుల ఘట్టమనేని జుట్టు ముట్టగానే అలా పక్కకు జరుగుతూ ముట్టుకోనివ్వలేదని చెప్పుకొచ్చింది. తన తండ్రి జుట్టు చాలా బాగుంటుందని.. అందుకే ఎవరినీ ముట్టుకోనివ్వరని, బలవంతంగా ముట్టుకున్నా ఆయనకు అస్సలే నచ్చదని వివరించింది. ప్రస్తుతం సితార చేసిన ఈ కామెంట్లు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరూ ఓసారి చూసేయండి.


Click it and Unblock the Notifications











