Sitara Ghattamaneni: వాకిట్లో దీపావళి ముగ్గు పెడుతూ ఫొటో దిగిన సితార.. మీరు చూశారా?
సూపర్ స్టార్ కృష్ణ మనుమరాలు, హీరో మహేశ్ బాబు, హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ ల గారాల పట్టి సితార గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పుట్టినప్పటి నుంచి ఆమె ఏం చేసినా వైరల్ గా మారుతుంది. ఆమె ఎక్కడకైననా వెళ్లినా, ఏమైనా చేసిన ఆ ఫొటోలు క్షణాల్లో నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ క్యూట్ పాపాయి ఈమధ్యే టీనేజ్ లోకి అడుగు పెట్టింది. ఇటీవలే ఓ యాడ్ లో కూడా నటించి అందరి మనసులను గెలుచుకుంది.
చూస్తుండగానే పెరిగి పెద్దవుతున్న ఈ పాపాయికి సినిమాలు అంటే చాలా ఇష్టం అని కూడా ఇటీవలే చెప్పింది. ముఖ్యంగా జాతీయ సినిమా దినోత్సవం రోజు ఓ పోస్టు కూడా పెట్టింది. సినిమా అనే పదానికి తన జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉందని.. నిమా అంటే తన దృష్టిలో కేవలం ఇండస్ట్రీ మాత్రమే కాదని జీవితంలో ఓ భాగం అని పెద్ద దానిలా చెప్పుకొచ్చింది. సితార చేసిన ఈ పోస్టు చూస్తుంటేనే ఆమెకు చాలా మెచ్యూరిటి ఉందని అర్థం అయిపోతుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ వారసురాలిగా సితార సినీ రంగంలో అడుగు పెడుతుందని అర్థం అవుతోంది.

సినిమాలపై ఉన్న ఇష్టంతోనే ఆమె ఓవైపు డ్యాన్స్ లో శిక్షణ కూడా తీసుకుంటుంది. ఓవైపు చదువు, మరోవైపు తనకు నచ్చిన వ్యాపకాలు నేర్చుకుంటూనే.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ క్యూట్ పాపాయి ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే పని చేస్తూ అందరినీ షాక్ కు గురి చేసింది.

దీపావళి పండుగ సందర్భంగా సితార ఘట్టమనేని.. తన ఇంట్లోని తులసి కోట ముందు ముగ్గు వేసింది. తనతో పాటు మరికొంత ముగ్గు వేస్తుండగా.. ఆమె కూడా వారికి సాయం చేసింది. దివాళి సందర్భంగా దీపాల ముగ్గు వేస్తూ అందరినీ మంత్ర ముగ్ధులను చేస్తోంది. సూపర్ క్యూట్ గా ఉన్న సితార ముగ్గు వేయడం మరింత క్యూట్ గా అనిపిస్తోంది. ఈ ఫొటోల్లో సితార లాంగావోణి, పరికిణీ ఏమీ వేసుకోకపోయినా.. అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది.

పింక్ టీషర్ట్, వైట్ కలర్ ప్యాంటులోనే సితార అందం అదిరిపోయింది. సితార పాప షేర్ చేసిన ఈ పొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చాలా క్యూట్ గా ఉన్నావు తల్లి, ముగ్గు కూడా నీలాగే అందంగా ఉందటూ చెప్పుకొస్తున్నారు. తులసికోటలో వెలుగుతున్న దీపంలాగే నీ మొహం కూడా వెలిగిపోతుందంటూ రాసుకొస్తున్నారు. ఏది ఏమైనా సితార పాప ఏం చేయినా చాలా క్యూట్ గానే అనిపిస్తుంది. మీరూ ఓ సారి ఈ క్యూట్ క్యూట్ ఫొటోలు చూసేయండి.


Click it and Unblock the Notifications











