Just In
- 5 hrs ago
నాని పని అయిపోయిందా..? వైరల్‌గా మారిన పోస్ట్
- 6 hrs ago
ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా.. జీవిత రాజశేఖర్ కామెంట్స్
- 6 hrs ago
మహేష్ ముచ్చట్లకు విజయశాంతి ఆశ్చర్యం.. సూర్యుడివో చంద్రుడివో అంటూ హల్చల్
- 7 hrs ago
రాంగోపాల్ వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ అందించిన కేఏ పాల్.. మామూలుగా వాడుకోలేదుగా.!
Don't Miss!
- Sports
రెండో టీ20లో సిమ్మన్స్ హాఫ్ సెంచరీ.. వెస్టిండీస్ ఘన విజయం
- News
చట్టాల మార్పులు సరిపోవు: మహిళలపై నేరాలపై వెంకయ్యనాయుడు
- Finance
ఆర్బీఐ ప్రకటనతో ఇన్వెస్టర్లలో జోష్
- Technology
ఆపిల్ వాచీల కోసం కొత్త ఫీచర్, చిర్ప్ 2.0
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 14 వరకు
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
సూపర్‌స్టార్ మహేష్ కూతురు సితార ఘనత.. ఫ్రోజెన్ 2లో ఎల్సా పాత్ర కోసం..
ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ ఫ్రోజెన్ 2 మూవీని అత్యంత ప్రతిష్టాత్మకం రూపొందించింది. ప్రపంచస్థాయి సాంకేతికతతో రూపొందిన యానిమేషన్ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో నవంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర ఎల్సాకు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖులైన నటీనటులు డబ్బింగ్ చేప్పారు.
హాలీవుడ్ వెర్షన్లో క్రిస్టిన్ బెల్, ఇదినా మెంజెల్ డబ్బింగ్ చెప్పగా, హిందీలో ప్రియాంక చోప్రా జోనస్ గొంతును అరువు ఇచ్చారు. తమిళంలో శృతిహాసన్ డబ్బింగ్ చెప్పారు. తెలుగులో నిత్యమీనన్తోపాటు తాజాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు ముద్దుల కూతురు సితారా ఘట్టమనేని డబ్బింగ్ చెప్పడం విశేషంగా మారింది.

ఫ్రోజెన్ 2 మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులు కుమార్తె, ఏడేళ్ల సితార ఘట్టమనేని చిన్నారి ఎల్సా పాత్రకు వాయిస్ ఓవర్ చెప్పారు. తెలుగులోకి డబ్బింగ్ అవుతున్న ఈ చిత్రం నవంబర్ 22న విడుదల అవుతున్నది అని చిత్ర నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అంతకుముందు, ఎల్సా పాత్ర కోసం నిత్యమీనన్ కూడా డబ్బింగ్ చెప్పారు. డిస్నీలాంటి సంస్థతో భాగస్వామ్యం కావడం హ్యాపీగా ఉంది అని ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఫ్రోజెన్ 2 చిత్రానికి క్రిస్ బక్, జెన్నీఫర్ లీ దర్శకత్వం వహించగా. పీటర్ డెల్ వెచొ నిర్మించారు. జెన్నీఫర్ లీ, ఆలిసన్ స్క్రీన్ ప్లే అందించారు. రాబర్ట్ లోపెజ్, క్రిస్టిన్ అండర్సన్, లోపెజ్ సంగీతం సమకూర్చారు. 2013లో విడుదలైన ఫ్రోజెన్ సినిమాకు ఇది సీక్వెల్. వాల్ట్ డిస్నీ బ్యానర్‌కు ఇది 58వ చిత్రం కావడం విశేషం.