రష్మికను మించిన సితార.. క్యూట్ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా
సరిలేరు నీకెవ్వరు చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి చిత్రాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు దూసుకుపోతుండగా.. మరోసారి తన స్టామినాను నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్లను కూడా పెంచేశారు చిత్రయూనిట్. ఇప్పటికే పోస్టర్స్, టీజర్‌తో అంచనాలు పెంచగా.. ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది.

మెగా ఈవెంట్ ప్లాన్..
ఈ మూవీకి అమాంతం అంచనాలు పెంచి అందరి దృష్టిని ఆకర్శించేందుకు మెగాస్టార్ చిరంజీవి దించుతున్నారు. జనవరి 5న నిర్వహించబోతోన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతోన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర, అనిల్ రావిపూడి చిరు ఇంటికి వెళ్లి ఆహ్వానించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి.

ఒక్కో వారం ఒక్కో పాట..
ఈ మూవీలోని పాటలను ఒక్కో వారం విడుదల చేస్తూ మెల్లిగా జనాల్లోకి ఎక్కేలా చేస్తున్నారు. మొదటగా మాస్ బీట్ అయిన మైండ్ బ్లాక్ అనే పాటను, ఆపై సూర్యుడివో చంద్రుడివో అంటూ మంచి ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇక రీసెంట్‌గా హీ ఈజ్ సో క్యూట్ అంటూ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
సితార డ్యాన్స్ వీడియో..
సోషల్ మీడియాలో సితారకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సితు పాప అంటూ క్యూట్‌గా పిలిచే మహేష్ బాబుకు.. వారంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీ ఈజ్ సో క్యూట్ అనే పాటకు రష్మీక స్టైల్లోనే స్టెప్పులేసింది సితార.

వైరల్ వీడియో..
ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ లేపుతోంది. ఎక్కడ చూసినా సితార క్యూట్ స్టెప్పులే దర్శనమిస్తున్నాయి. రష్మిక కంటే సితార బాగా చేసిందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై రష్మిక అయితే ఇంత వరకు స్పందించలేదు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











