twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీటీమార్‌ ఫ‌స్ట్‌లుక్: తమన్నాతో గోపీచంద్ రొమాన్స్.. స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌ మూవీ

    |

    మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న 'సీటీమార్‌' సినిమాతో గోపీచంద్ హంగామా చేయనున్నాడు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

    హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న‌ ఈ భారీ చిత్రంలో గోపీచంద్ సరసన మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమెతో పాటు మరో హీరోయిన్ దిగంగన సూర్యవంశీ కూడా నటిస్తుండటం ఆసక్తికర అంశం. చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్టర్‌లో హీరో గోపీచంద్ మాత్రమే కనిపిస్తున్నారు. ఆయన లుక్ ఎంతో డిఫెరెంట్‌గా ఉండటం ప్రేక్షకుల్లో ఆసక్తి నింపుతోంది.

    Siteemar First look: Gopichand With Tamannaah

    ఈ సందర్బంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ఇటీవ‌ల హైద‌రాబాద్, రాజ‌మండ్రిలో బిగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని సోమవారం నుండి ఆర్‌.ఎఫ్‌.సిలో కొత్త షెడ్యూల్ ప్రారంభించాం. నాన్‌స్టాప్‌గా షెడ్యూల్ జ‌రిపి స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. గోపిచంద్ కెరీర్ లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం. హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ప్రెస్టీజియస్‌ మూవీగా రూపొందుతోంది. హీరో గోపిచంద్‌కి భారీ క‌మ‌ర్షియ‌ల్ మూవీ అని చెప్పారు.

    గోపిచంద్‌ కెరీర్‌లో 28వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో తరుణ్ అరోర, భూమిక, పోసాని కృష్ణమురళి, రావురమేష్, అన్నపూర్ణమ్మ, ప్రగతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    Tottempudi Gopichand doing his 28 with Sampath Nandi. Now this movie Firstlook poster released by Unit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X