3 కోట్ల ఆఫర్.. వాళ్లకి లొంగిపోయుంటే.. బిగ్‌బాస్ విన్నర్ భార్య సంచలనం
బెట్టింగ్ యాప్స్ అంశం గత కొద్దిరోజులుగా తెలుగునాట సినీ, రాజకీయ రంగాల్లో కలకలం రేపుతోంది. పలువురు సెలబ్రెటీలు, యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పేర్లు ఈ వ్యవహారంలో వినిపిస్తున్నాయి. అలాగే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల పేర్లు, ఆయా వెబ్‌సైట్ల పేర్లను కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ లిస్ట్‌లో మరికొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను పోలీసులు విచారించారు కూడా.
బెట్టింగ్ యాప్ కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్‌గా ఉన్నారు. దీని వెనుక ఎవరున్నా వారిని చట్టం ముందు నిలబెడతామని.. బెట్టింగ్ యాప్స్‌ను కంట్రోల్ చేయడానికి చేయడానికి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. పలువురు ప్రముఖులపై కొందరు లేనిపోని ఆరోపణలు చేయడంపైనా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇలాంటి వారిని నియంత్రించేందుకు కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు శివబాలాజీ, మధుమిత దంపతులు.

సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న నటీనటులెందరో . ఈ కోవలోకే వస్తారు శివబాలాజీ - మధుమిత. ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన బాలాజీ.. తొలుత హీరోగా నటించినా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సెకండ్ హీరోగా సెట్ అయ్యారు. ఆర్య, సంక్రాంతి, అన్నవరం, చందమామ, శంభో శివ శంభో, కాటమరాయుడు తదితర చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగు బిగ్‌బాస్ తొలి సీజన్ విజేతగా నిలిచి ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా అసోసియేషన్)లో కీలకపాత్ర పోషిస్తున్నారు శివబాలాజీ.
శివబాలాజీ , మధుమితలు ఇంగ్లీష్ కారన్ అనే సినిమాలో నటిస్తున్న సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. అందరు ప్రేమ జంటల మాదిరిగానే వీరి ప్రేమకథలోనూ ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. పెద్దల అంగీకారంతో ఎట్టకేలకు 2009లో ఈ జంట ఒక్కటైంది. కొన్ని కారణాలతో శివబాలాజీ - మధుమితలు ఒక్కటయ్యే వరకు ఓ సందర్భంలో వ్యవహారం నడిచింది. అయితే ఇద్దరూ సమయస్పూర్తితో వ్యవహారించి తమ బంధాన్ని నిలబెట్టుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శివబాలాజీ , మధుమితలు ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు.
తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ. . ప్రస్తుతం తెలుగునాట హాట్ టాపిక్‌గా మారిన బెట్టింగ్ యాప్స్ గురించి కీలక విషయాలు బయటపెట్టారు. తమ యూట్యూబ్ ఛానెల్ వేదికగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని కొందరు తమను సంప్రదించారని మధుమిత తెలిపారు. ఇందుకు రూ.3 కోట్ల వరకు ఆఫర్ చేశారని.. కానీ తాము దానిని తిరస్కరించామని చెప్పారు. బెట్టింగ్ యాప్సే కాకుండా ట్రేడింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేయమని అడిగారని కానీ మేం వేటికీ అంగీకరించలేదని ఆమె తెలిపారు. ప్రస్తుతం వీరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా .. ఒకవేళ బెట్టింగ్ యాప్స్‌కి కనుక ప్రమోషన్ చేసుంటే శివబాలాజీ, మధుమితలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











