‘రాఘవ రెడ్డి’ నుంచి తప్పించుకోలేరు.. పబ్‌లో ఎంజాయ్ చేస్తోన్న అజయ్ ఘోష్

లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థలో గతేడాది అక్కడొకటుంటాడు అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు శివ కంఠంనేని. మళ్లీ మరోసారి రాఘవ రెడ్డి అనే చిత్రంతో పలకరించబోతోన్నాడు. అదే నిర్మాణ సంస్థలో వరుసగా రెండో సారి చేస్తుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే సినిమాను ఏప్రిల్‌లో ప్రారంభించిన చిత్రబృందం.. త్వరలోనే షూటింగ్‌ను ముగించబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలను వెల్లడించారు.

చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. ఈ మూవీ ఫ్యామిలీ, యాక్షన్, సస్పెన్స్ ఇలా ప్రతీ ఒక్క జానర్‌ను టచ్ చేస్తుందని అన్నాడు. ఈ మూవీ అందరికి నచ్చుతుందని పేర్కొన్నాడు. రాఘవ రెడ్డి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని.. క్రిమినల్స్ కాంట్ ఎస్కేప్ అనేది క్యాప్షన్. ఈ చిత్రంలో హీరో నేర పరిశోధనలో ప్రొఫెసర్ అని, ఆయన చేతిలోంచి ఏ క్రిమినల్ కూడా తప్పించుకోలేరని, ఆ కథకు హాస్యాన్ని, ఎమోషన్స్‌ను, సస్పెన్స్‌ను ఇలా అన్నింటిని జోడించామని చెప్పుకొచ్చాడు.

 Siva Kantamneni And Sanjeev Megoti New Movie Raghava Reddy

ఈ మూవీలోని ఓ ఐటెమ్ సాంగ్‌ను హైద్రాబాద్‌లోని ఓ పబ్‌లో చిత్రీకరించారు. అజయ్ ఘోష్‌పై తెరకెక్కించిన ఈ పాటలో స్నేహా గుప్తా తన స్టెప్పులతో అందర్నీ ఆకట్టుకుంది. ఈ పాటతో దాదాపు షూటింగ్ పూర్తవుతుందని, త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో నందితా శ్వేత, శ్రీనివాస్ రెడ్డి, పోసాని, బిత్తిరి సత్తి, అజయ్, రఘుబాబు, అజయ్ ఘోష్, ప్రవీణ్, అన్నపూర్ణమ్మ, చమ్మక్ చంద్ర, స్నేహా గుప్తా, మీనా కుమారి, బీహెచ్‌ఈఎల్ ప్రసాద్, ఆర్ వెంకటేశ్వర్ రావు, చంద్రకాంత్, లాబ్ శరత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కె.ఎస్. శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వర్ రావు, జీ. రాంబాబు యాదవ్ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X