Sivaji: ఇక ఆపండి.. లేకపోతే ఆ నింద నేను మోయాల్సి వస్తుంది
Sivaji: సీనియర్ నటుడు, బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ (Sivaji) హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. నిండుగా కప్పుకునే దుస్తుల్లోనే నిజమైన అందం ఉంటుందని, అసభ్యంగా అనిపించే దుస్తులు ధరిస్తే చూసేవాళ్లు బయటకు నవ్వినా లోపల మాత్రం విమర్శిస్తారని శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలను మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై దాడిగా పలువురు అభివర్ణించడంతో, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.
ఈ వ్యాఖ్యలపై యాంకర్, నటి అనసూయ భరద్వాజ్‌తో పాటు ప్రముఖ గాయని చిన్మయి తీవ్ర స్థాయిలో స్పందించారు. మహిళలు ఏ దుస్తులు ధరించాలన్నది వారి వ్యక్తిగత నిర్ణయమని, దానిపై వ్యాఖ్యానించడం సరికాదని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా అనసూయ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వరుస పోస్టులు చేస్తూ శివాజీ వ్యాఖ్యలను ఖండించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే, మరోవైపు కొంతమంది మాత్రం శివాజీ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, ఆయన చెప్పింది వ్యక్తిగత అభిప్రాయమే అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఈ అంశం టాలీవుడ్‌లో రెండు వర్గాలుగా చీలిపోయి చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో తాజాగా నటుడు శివాజీ తన స్పందనను వెల్లడించారు. ఆయన నటించిన తాజా చిత్రం 'దండోరా'కు సంబంధించి మూవీ యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్‌లో శివాజీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వివాదాలపై కాకుండా, పూర్తిగా సినిమా గురించే మాట్లాడాలని కోరారు. శివాజీ మాట్లాడుతూ.. ' దండోరా .. కొన్ని తరాలకు ఒకసారి మాత్రమే ఇలాంటి సినిమాలు వస్తాయి. రెండు రోజుల ముందు ప్రీమియర్స్ పడినట్లయితే కలెక్షన్లు ఇంకోలా ఉండేవి. సెన్సార్ కారణంగా సినిమా విడుదల ఆలస్యమైంది. అయినప్పటికీ 'దండోరా' గురించి 2026 మొత్తం కూడా మాట్లాడుకుంటారు. విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది'అని అన్నారు.
అలాగే తన పాత్ర కోసం చేసిన త్యాగాల గురించి కూడా శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు నేను రోజుకు కేవలం రెండు గంటలే నిద్రపోయాను. ముఖం ఉబ్బుగా, నిద్రముఖంలా కనిపించాలి అనేదే నా పాత్ర డిమాండ్. డైరెక్టర్ నాకు నిద్రమానుకోమని చెప్పలేదు.. కానీ పాత్రకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేనే అలా చేశాను. నేను అలా కనిపించకపోతే దర్శకుడికి నష్టం కలుగుతుందని భావించాను'అని వివరించారు.
ప్రతి సినిమా వెనుక ఆర్టిస్టుల కష్టం ఉంటుందని చెప్పిన శివాజీ.. 'సినిమా కోసం ప్రతి ఆర్టిస్టు ప్రాణం పెడతాడు. అలాంటి నిజాయితీతో చేసిన సినిమానే 'దండోరా'. దయచేసి నా వ్యక్తిగత విషయాల వైపు వెళ్లకండి. అవి నేను విడిగా చూసుకుంటాను. వాటివైపు వెళ్లకుండా ఈ సినిమాను ప్రమోట్ చేయండి. లేకపోతే ఆ నింద కూడా నేనే మోయాల్సి వస్తుంది. ఈ సినిమా గురించి మాత్రమే మాట్లాడండి 'అని విజ్ఞప్తి చేశారు.
ఇక తాను ఎవరితోనైనా మాట్లాడాల్సి ఉంటే థియేటర్‌లోనే మాట్లాడతానని చెప్పిన శివాజీ.. 'మంచి సినిమాను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆర్టిస్టుపై ఉంటుంది. దండోరా గురించి మాత్రమే మాట్లాడండి. కావాలంటే నేను థియేటర్‌కు వస్తాను' అంటూ తన మాటను ముగించారు. ఈ వ్యాఖ్యలతో శివాజీ మరోసారి చర్చకు కేంద్రబిందువయ్యారు. ఒకవైపు డ్రెస్సింగ్ కామెంట్స్‌పై కొనసాగుతున్న వివాదం, మరోవైపు 'దండోరా' సినిమాపై ఆయన చూపుతున్న కమిట్‌మెంట్ ఇవన్నీ కలిసి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











