లక్షల్లో గోల్‌మాల్.. బ్రహ్మానందంతో ఆ నటుడి గొడవ .. పరిటాల రవి వార్నింగ్ దెబ్బకి
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నంత మంది కమెడియన్లు ఏ సినీ పరిశ్రమలోనూ ఉండరని అందరికీ తెలిసిందే. హీరోల రేంజ్ స్టార్ స్టేటస్ అనుభవించిన నటులు కూడా టాలీవుడ్‌లో ఉన్నారు. ఈ కోవకే వస్తారు హాస్య బ్రహ్మా డాక్టర్ బ్రహ్మానందం. దాదాపు 4 దశాబ్ధాలుగా తెలుగువారిని తన కామెడీతో నవ్విస్తున్నారాయన. అలాంటి వ్యక్తితో విభేదాలు చోటు చేసుకుని, ఏకంగా పంచాయతీ వరకు తీసుకెళ్లాడో నటుడు. ఈ వివరాల్లోకి వెళితే..
బ్రహ్మానందంతో గొడవపడ్డ ఆ నటుడు మరెవరో కాదు శివాజీ రాజా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఆయనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. చదువుకునే రోజుల్లోనే హీరోలను, ఇతర నటులను, వారి డైలాగ్స్‌ను అనుకరిస్తూ అందరినీ నవ్వించేవారట శివాజీ రాజా. విచిత్రమైన వాయిస్, డైలాగ్ డెలివరీతో ఆయన అప్పట్లోనే మంచి గుర్తింపును సంపాదించారు. ఈ నేపథ్యంలో కొందరి సలహా మేరకు మద్రాస్ రైలెక్కారు . అవకాశాల కోసం పాండి బజార్, టీ.నగర్ ఏరియాల్లోని స్టూడియోల చుట్టూ తిరిగారు. ఎన్ని కష్టాలు పడినా చివరికి అనుకున్నది సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగారు శివాజీ రాజా.

ఈ దశలో జంధ్యాల దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన సీతారామకళ్యాణంలో చిన్న పాత్ర పోషించే అవకావం దక్కింది. ఆ తర్వాత వంశీ దర్శకత్వంలో వచ్చిన కళ్లు చిత్రం ఆయనకు బ్రేక్ ఇచ్చింది. దీంతో శివాజీ రాజా బిజీ అయ్యారు. హీరో ఫ్రెండ్‌గా, అన్నగా, తమ్ముడిగా, విలన్‌గానూ తన కామెడీతో నవ్వించారు. అవకాశాలు తగ్గుతున్న దశలో జెమినీ టీవీలో ప్రసారమైన అమృతం సీరియల్స్ శివాజీ రాజాను మరోసారి నిలబెట్టింది.
వయసు, ఇతర అనారోగ్య కారణాలతో సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు శివాజీ. నటుడిగానూ కాదు.. మా అధ్యక్షుడిగానూ శివాజీ రాజా సినీరంగానికి, కళాకారులకు సేవలందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సినీ కార్మికుల సంక్షేమానికి కృషి చేశారు. కరోనా సమయంలో ఎంతో మందికి నిత్యావసర సరకులు, ఆర్ధిక సాయం చేశారు. మొయినాబాద్‌లోని పొలంలో గడపటానికి ఇష్టపడే ఆయన తన కొడుకు విజయ్ రాజాని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
తొలి నుంచి శివాజీ రాజాలో దూకుడు స్వభావం ఎక్కువే. అప్పట్లో తన తండ్రిని ఎవరో ఏదో అన్నారని గొడవకి దిగారట శివాజీ రాజా. ఇండస్ట్రీకి వచ్చాక కూడా అదే దూకుడుతో ఉండేవారట. తప్పు తన వైపు ఉంటే తలదించుకోవడం, లేదంటే అవతలి వ్యక్తిని ఢీకొట్టడం శివాజీ రాజా తత్వం. ఇదిలాఉండగా.. తన తోటి నటీనటులతో కలిసి ఓ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు శివాజీ. ఇందులో బ్రహ్మానందం కూడా కీలకపాత్ర పోషించారు. అయితే ఈ ట్రస్ట్‌లో నిధులు పక్కదారి పడుతున్నట్లు తన దృష్టికి రావడంతో తాను బ్రహ్మానందంను నిలదీశానని .. మా ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగిందని శివాజీ రాజా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
వివాదం పెద్దదిగా మారి మోహన్ బాబు, పరిటాల రవి వరకు వెళ్లడంతో స్వయంగా మోహన్ బాబు ఫోన్ చేసి రమ్మన్నారని.. అయితే ఇంతలో శ్రీహరి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని సలహా ఇచ్చారని శివాజీ రాజా వెల్లడంచారు. తాను మోహన్ బాబు ఇంటికి వెళ్లగానే ఆయన దీని గురించి అడిగారని, పరిటాల రవి కూడా అప్పటికే వచ్చి ఉండటంతో ఎందుకమ్మా గొడవలు, సైలెంట్‌గా ఉండాలని సూచించారని శివాజీ రాజా గుర్తుచేసుకున్నారు. తాను బ్రహ్మానందంతో మొత్తం సెటిల్ చేసుకున్నానని ..మా ఇద్దరి మధ్య ఏం లేదని చెప్పి వచ్చేశానని శివాజీ అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











