పవన్ కళ్యాణ్‌కు శివాజీ రాజా కౌంటర్.. ఇలాగే మాట్లాడతానంటూ రచ్చ రచ్చ
సీనియర్ జర్నలిస్ట్, పీఆర్‌ఓ పసుపులేటి రామారావు ఇటీవలె మృతి చెందిన సంగతి తెలిసిందే. యూరిన్ ఇన్ఫెక్షన్‌కి గురైన ఆయన ఫిబ్రవరి 11న వనస్థలిపురంలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో మరణించారు. ఈయన మృతిపై సినీ పెద్దలందరూ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి వంటి సినీ పెద్దలు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..
పసుపులేటి రామారావు మృతి పట్ల సినీ ప్రముఖులందరూ సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వయంగా చిరంజీవి పసుపులేటి ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళ్లు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపాడు. పవన్ కళ్యాణ్, మోహన్ బాబు దగ్గరి నుంచి యంగ్ హీరోల వరకు సోషల్ మీడియాలో స్పందించారు.

చిరంజీవికి ధన్యవాదాలు..
సినీ ప్రముఖులు ఏర్పాటు చేసిన సంతాప సభలో శివాజీ రాజా మాట్లాడుతూ.. అందరిపై ఫైర్ అయ్యాడు. మద్రాసులో ఉన్నప్పటి నుంచి ఆయన సినీ పరిశ్రమకు సేవ చేస్తూనే ఉన్నాడని, ఆయన రాసిన రాతల వల్లే తామంతా ఈ స్థాయిలో ఉన్నామని గుర్తు చేసుకున్నాడు. ఆ మధ్య ఆయన మోకాళుకు చికిత్స చేయిస్తానంటే.. చిరంజీవి గారు చేయిస్తారని అన్నట్లు ఆయన తెలిపాడని.. శివాజీ రాజ గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా చిరంజీవి గారికి ధన్యవాదాలు అంటూ శివాజీ రాజా చెప్పుకొచ్చాడు.

పవన్ కళ్యాణ్‌కు కౌంటర్..
పసుపులేటి రామారావు గారు పోతే.. ఎంతో మంది స్పందించారు. చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని కొందరు (పవన్ కళ్యాణ్), మా కుటుంబంలోని వ్యక్తి అని మరికొందరు సంతాపాన్ని వ్యక్తం చేశారు.. మరి వారంతా ఎక్కడికి పోయారు.. ఇక్కడ లేరే? అంటూ ఫైర్ అయ్యాడు. ఎవరైనా చనిపోతే.. ఈ పదాలు వాడాలని వాడేస్తుంటారంటూ చురకలంటించాడు.

మీడియాపైనా ఫైర్..
తనకు ఇలాగే మాట్లడటం వచ్చు.. ఇలాగే మాట్లాడతానంటూ.. మీడియాపైనా ఫైర్ అయ్యాడు. తనకు అబద్దాలు చెప్పే అలవాటు లేదని అంటూ.. నటీనటుల మధ్య బేధాభిప్రాయాలున్నాయి ఓకే.. మీడియాలోనూ ఉన్నాయి.. అలాంటి వ్యక్తిని ఇలానా పంపించేదంటూ ఫైర్ అయ్యాడు. ఎవరైనా చనిపోతే.. ఎంతో కొంత కలెక్ట్ చేసి ఇవ్వడం తనకు అలవాటని, అదే విధంగా ఆయన కుటుంబానికి కూడా ఓ ఐదు లక్షలు అందిస్తానని, అదే తాను చేయగలిగిన సహాయమని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











