ఆ పనిలో నిమగ్నమైన శివాజీ రాజా.. అలీ సహా మరో నలుగురిని ఇన్వాల్వ్ చేస్తూ..!
సోషల్ మీడియాలో పలు ఛాలెంజ్‌లు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇమ్మడిముమ్మడిగా కొత్త కొత్త ఛాలెంజ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇందులో కొన్ని అనవసరం అనే టాక్ వచ్చినప్పటికీ.. కొన్నింటికి మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు సెలబ్రిటీలు. ముఖ్యంగా గ్రీన్ ఛాలెంజ్, సేఫ్ హాండ్స్ లాంటి ఛాలెంజ్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది.
ఈ నేపథ్యంలో నటుడు, మాజా 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా మరో ఛాలెంజ్ చేసి వార్తల్లో నిలిచారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా షట్ డౌన్ కావడంతో జనం అంతా ఇళ్లనుంచి బయటకు రావడం లేదు. ఈ పరిస్థితుల నుంచి పుట్టుకొచ్చింది స్టే హోమ్ ఛాలెంజ్. తమకు లభించిన విశ్రాంతి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ ఛాలెంజ్ స్వీకరిస్తున్నారు సెలబ్రిటీలు.

తాజాగా ఈ స్టే హోమ్ ఛాలెంజ్ స్వీకరించిన శివాజీ రాజా.. ఈ విరామ సమయాన్ని తన ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేయడం కోసం కేటాయించారు. అక్కడ పండించిన పంటలను చుట్టుపక్కల వాళ్లకు పంచాలని డిసైడ్ అయ్యారు. మా అసోసియేషన్ సభ్యులకు సహాయం చేసేందుకు కూడా ముందుకు వచ్చారు. పదిహేను రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు అందిస్తానన్నారు.
ఇక ఈ స్టే హోమ్ ఛాలెంజ్ కోసం మరో ఐదుగురిని నామినేట్ చేశారు శివాజీ రాజా. ఆ లిస్టులో కమెడియన్ అలీ, హీరో శ్రీకాంత్, సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, కృష్ణవంశీ, నటుడు ఉత్తేజ్ ఉన్నారు.


Click it and Unblock the Notifications











