twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మా' ఇష్యూపై శివాజీరాజా సెన్సేషన్.. పెద్దలను పిలిచి అవమానించారంటూ ఫైర్

    |

    'మా' 2020 డైరీ ఆవిష్కరణలో జరిగిన పరిణామాలు సినీ వర్గాల్లో హాట్ హాట్ చర్చలకు దారితీశాయి. వేదికపై చిరంజీవి ఇచ్చిన సలహాపై రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేసి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఇష్యూపై 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీరాజా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి పోతే..

     భగ్గుమన్న విభేదాలు.. రాజశేఖర్, చిరంజీవి

    భగ్గుమన్న విభేదాలు.. రాజశేఖర్, చిరంజీవి

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. 'మా' 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్, చిరంజీవి మధ్య రాజుకున్న వివాదం అందరినీ ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది. రాజ‌శేఖ‌ర్ ప్ర‌వ‌ర్తించిన తీరుప‌ట్ల మోహ‌న్‌బాబు, కృష్ణంరాజు, ముర‌ళీమోహ‌న్ త‌దిత‌రులు వెంటనే తమ అసంతృప్తిని తెలియజేశారు.

    శివాజీరాజా సెన్సేషన్

    శివాజీరాజా సెన్సేషన్

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ గత కొన్నేళ్లుగా వివాదాల సుడిగుండంలో చిక్కుకుపోయింది. 'మా' సభ్యుల్లో ఒకరికొకరంటే ఏ మాత్రం పడటం లేదు. గతంలో శివాజీరాజా- నరేష్ మధ్య వివాదం రాజుకొని సంచలనం కాగా ఇప్పుడు రాజశేఖర్- నరేష్ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మా డైరీ ఆవిష్కరణ సభలో జరిగిన పరిణామాలపై స్పందిస్తూ శివాజీరాజా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

    పెద్ద‌ల‌ను పిలిచి అవమానించారు

    పెద్ద‌ల‌ను పిలిచి అవమానించారు

    నిన్న జ‌రిగిన ప‌రిణామాలు చాలా దుర‌దృష్ట‌క‌రమని చెప్పిన శివాజీ రాజా.. చిరంజీవి స‌హా పెద్ద‌లంద‌రూ వేదిక‌పై ఉండ‌గా ఇలా జ‌ర‌గ‌డం బాధ‌గా అనిపించిందని పేర్కొన్నారు. పెద్ద‌ల‌ను పిలిచి స‌భ‌ను ర‌సాభాస చేయ‌డ‌మే కాకుండా అవ‌మాన ప‌రిచారని అన్నారు. ఎన్నిక‌లు జ‌రిగి ఇంతకాలం అవుతున్న‌ప్ప‌టికీ రూపాయి లెక్క తెలియ‌ని అధ్య‌క్షుడు దీనిపై ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు.

     ఇలాంటి అధ్య‌క్షుడు ఉండ‌టం దురదృష్టకరం

    ఇలాంటి అధ్య‌క్షుడు ఉండ‌టం దురదృష్టకరం

    తాను వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రినీ దూషించ‌డం లేదు, కానీ ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలని శివాజీ రాజా అన్నారు. రాజ‌శేఖ‌ర్‌గారు చాలా ఎమోష‌న‌ల్ ప‌ర్స‌న్‌ అని, `మా`కు10 ల‌క్షలు విరాళం ఇచ్చినా కూడా ఆయన బ‌య‌ట‌కు చెప్పుకోలేదని గుర్తుచేశారు శివాజీరాజా. ఈ సందర్బంగా అసోసియేష‌న్‌కు న‌రేష్‌గారు ఎంత ఫండ్ తెచ్చారో చెప్పాలని అడిగారు.

    వ‌డ్డించిన విస్త‌ర‌ని కాలితో తన్నారు

    వ‌డ్డించిన విస్త‌ర‌ని కాలితో తన్నారు

    దాతలు విరాళాలు ఇస్తామ‌ని ముందుకు వ‌స్తే వ‌డ్డించిన విస్త‌ర‌ని కాలితో త‌న్నారని, ఇలాంటి అధ్య‌క్షుడు ఉండ‌టం చాలా దుర‌దృష్ట‌క‌రమని శివాజీరాజా ఆరోపించారు. దీంతో శివాజీ రాజా మాట్లాడిన తీరు సినీ వర్గాల్లో మరిన్ని చర్చలకు తావిస్తోంది.

    English summary
    Movie Artists Association Dairy Inauguration 2020 held at Park Hayat of Hyderabad. In this event Rajasekhar unhappy with Chiranjeevi words. Now Sivaji Raja reacted on this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X