Sankranthi 2024: సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న మరో సినిమా.. ఏది, ఎందుకో తెలుసా?
సంక్రాంతి చాలా పెద్ద పండుగ. ఈ పండుగ పూట తెలుగు ప్రజలను అలరించేందుకు అనేక సినిమాలు రాబోతున్నాయి. ఎవరూ ఏమాత్రం తగ్గకుండా అంతా పండుగప్పుడే తమ సినిమాలను విడుదల చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మూడు రోజుల్లోనే ఆరు చిత్రాలు విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే మొన్నటి వరకు మొత్తం 8 సినిమాలు వస్తున్నట్లు చెప్పినా రెండు సినిమాలు మాత్రం వెనక్కి తగ్గాయి. సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నాయి. ఇలా ప్రస్తుతం ఆరు బరిలో ఉండగా.. మరో సినిమా పోటీ నుంచి సైడ్ అయింది. అయితే ఈ సినిమా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా మొత్తం 6 సినిమాలు విడుదలకు ప్లాన్ చేసుకున్నాయి. అందులో అందులో 12వ తేదీ రోజే.. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, తేజా సజ్జా హనుమాన్, శివకార్తికేయన్ అయలాన్, విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్ లు వస్తున్నట్లు చెప్పాయి. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 13వ తేదీ రోజు సైంధవ్, ఈగల్ సినిమాలు విడుదల కాబోతున్నట్లు ప్రకటించాయి. ఇక చివరి రోజు అంటే 14వ తేదీ రోజు నా సామి రంగా సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
Recommended Video


కానీ ఈ పోటీలోంటి అయలాన్ సినిమా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. కేవలం తెలుగు మాత్రమే ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా కూడా మిగతా భాషల్లో విడుదల అవుతుండగా.. ఒక్క తెలుగులోనే థియేటర్లు దొరక్క పక్కకు తప్పుకుంది. ప్రస్తుతం అయలాన్ కూడా కెప్టెన్ మిల్లర్ లాగే రూటు మార్చుకుంది. మిగతా భాషల్లో ఈ సినిమా విడుదల చేస్తున్నప్పటికీ.. తెలుగులో మాత్రం ఆ తర్వాత విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఆ రిలీజ్ డేట్ నుకూడా త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు.
సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా చేస్తుండగా.. ఆర్. రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో శివకార్తికేయన్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్ లో కోటపాడి జె రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గ్రహాంతర వాసి అయిన ఏలియన్ తో శివకార్తికేయన్ స్నేహం చేయడం, దానికి సాయం చేయడాన్ని మనం ఈ సినిమాలో చూడవచ్చు. జనవరి 12వ తేదీన హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఒక్క తెలుగులో మాత్రమే వాయిదా పడగా.. ఎప్పుడు విడుదల అవుతుందో త్వరలోనే ప్రకటిస్తారట. చూడాలి మరి ఎప్పుడు ఈ సినిమా ఏ రేంజ్ లో అలరించనుంది అనేది.


Click it and Unblock the Notifications











