శివ కార్తికేయన్ నటించిన వరుణ్ డాక్టర్ ట్రెండింగ్.. దసరా బరిలో స్టార్ హీరోలకు ధీటుగా.. !
రెమో, సీమ రాజా, శక్తి చిత్రాలతో తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. అమ్మాయిల అక్రమ రవాణా నేపథ్యంగా తెరకెక్కిన వరుణ్ డాక్టర్ చిత్రంలో మరో కీలక పాత్రతో ప్రేక్షకుల ముందకు రాబోతున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన చిత్రమిది. కేజేఆర్ స్టూడియోస్ అధినేత కోటపాడి కే రాజేష్ ఈ చిత్రాన్ని గంగ ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్.కె. ప్రొడక్షన్స్ సంస్థలతో సంయుక్తంగా నిర్మించారు. విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 9న డాక్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ప్రేక్షకుల నుంచి సూపర్‌గా రెస్పాన్స్ రావడంతో 1.5 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నది.
ఈ సందర్భంగా నిర్మాత కోటపాడి జే రాజేష్ మాట్లాడుతూ.. శివ కార్తికేయన్ గారికి తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. ట్రైలర్ కు లభిస్తున్న స్పందన అందుకు ఉదాహరణ. 'శక్తి' తర్వాత మరోసారి ఆయనతో చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ లో ఆయన స్టైలిష్ లుక్, నటన అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాలో కథానాయకుడి పాత్ర చిత్రణ సైతం అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అద్భుతమైన కథ, కమర్షియల్ హంగులతో అద్భుతమైన సినిమా తీశారు అన వెల్లడించారు.

వరుణ్ డాక్టర్ చిత్రం ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తుంది. వాన చిత్రంలో హీరోగా నటించిన వినయ్, డాక్టర్‌లో ప్రతినాయకుడిగా నటించారు. అలాగే, గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్... శివ కార్తికేయన్ సరసన నటించారు. సంచలనం అనిరుధ్ అందించిన పాటలకు తమిళంలో అద్భుత స్పందన లభించింది. త్వరలో తెలుగు పాటలను విడుదల చేస్తాం. విజయదశమికి ప్రేక్షకులందరూ కుటుంబంతో కలిసి చూసే చక్కటి చిత్రమిది అని కోటపాడి జే రాజేష్ అన్నారు.
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ఇదొక మాస్ ఎంటర్టైనర్. ట్రైలర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభించడం సంతోషంగా ఉంది. సినిమా సైతం ప్రేక్షకులు అందరినీ తప్పకుండా అలరిస్తుందని చెప్పగలను అని అన్నారు.

నటీనటులు: శివ కార్తికేయన్, ప్రియాంక అరుల్ మోహన్, వినయ్ రాయ్ విలన్. యోగి బాబు, మిలింద్ సోమన్ తదితరులు
మాటలు: రాజేష్ ఏ మూర్తి
పాటలు: రాజశ్రీ సుధాకర్, శ్రీనివాసమూర్తి
ఎడిటింగ్: ఆర్ నిర్మల్
కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్
సంగీతం: అనిరుధ్
నిర్మాత: కోటపాడి జే రాజేష్
రచన దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్


Click it and Unblock the Notifications











