RRR కోసం వెనక్కి తగ్గిన మరో యువ హీరో.. రాజమౌళి కోసమే ఆ నిర్ణయం!
టాలీవుడ్ చరిత్రలోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీ లో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ RRR ఈ నెలలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా మార్చి 25 వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి చిత్ర యూనిట్ సభ్యులు ఫుల్ క్లారిటీ తో అయితే ఉన్నారు. ఇక ఈ సినిమా కోసం ఇటీవల ఒక తమిళ హీరో తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి కోసమే అతను ఒక అడుగు వెనక్కి అన్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

రాజమౌళి మీద నమ్మకం
RRR సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా చాలామంది సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా తో మంచి గుర్తింపును అందుకున్న దర్శకుడు రాజమౌళి తప్పకుండా మరోసారి పూర్తిస్థాయిలో ఎంటర్టైన్మెంట్ అందించే విధంగా సినిమాను తెరకెక్కించి ఉంటాడు అని అన్ని వర్గాల ప్రేక్షకులు నమ్ముతున్నారు. సౌత్ లో పూర్తి స్థాయిలో ఈ సినిమాకు సాలిడ్ వసూళ్లు అవుతాయి అని చెప్పవచ్చు. అందులో మాత్రం ఏ మాత్రం అనుమానం లేదు.

సోలోగానే రావాలని..
అయితే దర్శకుడు రాజమౌళి ముందుగానే సినిమా విడుదల తేదీ విషయంలో పక్కా ప్రణాళికతో సిద్ధమవడం విశేషం. అన్నిటికంటే ముఖ్యంగా RRR సినిమా వస్తున్నప్పుడు ఇండస్ట్రీలో పెద్ద సినిమాలతో పోటీ లేకుండా చూసుకున్నారు. నార్త్ సౌత్ లో సినిమా బాక్సాఫీస్ వద్ద సోలోగా రిలీజ్ అవ్వాలి అని ఈ సినిమా సందడిలో మిగతా సినిమాల హడావుడి మాత్రం ఉండకూడదు అని డిసైడ్ అయ్యాడు.

రాజమౌళి మీద గౌరవంతో..
సంక్రాంతికి విడుదల చేస్తున్నప్పుడే పోటీగా సర్కారు వారి పాట తో పాటు మిగతా సినిమాలు కూడా ఉన్నాయని వాటిని తప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మరికొన్ని సినిమా పోటీకి వచ్చే ప్రయత్నం చేయగా అప్పుడే రాజమౌళి నిర్మాతలతో మాట్లాడి ఒక ఒప్పందం కూడా చేసుకోవాల్సి వచ్చింది. రాజమౌళి మీద గౌరవంతో కొందరు హీరోలు కూడా వారి సినిమాలను RRR కి పోటీ లేకుండా చేసుకుంటున్నారు.

వెనుకడుగు వేసిన శివకార్తీకయేన్
ఒక విధంగా మిగతా సినిమాలు కూడా RRR కు పోటీగా వెళ్లడం అంటే పెద్ద రిస్కుతో కూడుకున్న పని అనే చెప్పాలి. రీసెంట్ గా రాజమౌళి కోసం మరో యువ హీరో కూడా తన సినిమాను వాయిదా వేసుకోవలసి వచ్చింది. ఆ హీరో మరెవరో కాదు తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే వందకోట్ల మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్న శివకార్తికేయన్.
Recommended Video

డాన్ సినిమా వాయిదా..
రీసెంట్ గా అతను తన డాన్ సినిమాను కూడా రాజమౌళి కోరిక మేరకు మార్చి 25న రిలీజ్ చేయాల్సిన తన డాన్ సినిమాను మే 13వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తెలియజేశాడు. శివ కార్తికేయన్ ఇంతకుముందు RRR సినిమా తమిళ్ ఈవెంట్ ను నిర్వహించగా అప్పుడు ప్రత్యేక అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











