టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ తో శివకార్తికేయన్ 20వ సినిమా.. ఆసక్తికర లైన్.. దిమ్మతిరిగే రెమ్యునరేషన్?
ఈ మధ్య కాలంలో తెరమీదకు వస్తున్న క్రేజీ కాంబినేషన్లు ఆసక్తి రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హీరోలతో తెలుగు దర్శకులు - తెలుగు దర్శకులతో తమిళ హీరోల కాంబినేషన్లు చర్చనీయాంశంగా మారాయి. ఇక అలా ఒక ప్రచారం జరిగిన కాంబో గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

తెలుగు సినిమాలు
తమిళ స్టార్ హీరో ధనుష్ మొదలు ఇతర తమిళ హీరోలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. కొద్ది రోజుల క్రితం ధనుష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఒక ట్రై లింగ్యువల్ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ధనుష్ మరో తెలుగు సినిమా ఒప్పుకున్నాడని, దర్శకుడు వెంకీ అట్లూరితో ఆయన సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంకా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు.

తమిళ హీరోలు ఫ్లాట్
ఇక తెలుగు దర్శకులు చెబుతున్న కథలకు తమిళ హీరోలు అందరూ ఫ్లాట్ అవుతున్న క్రమంలో విజయ్ తలపతి- వంశీ పైడిపల్లి, ధనుష్ - శేఖర్ కమ్ముల కాంబినేషన్లలో సినిమాలు ఖరారు అయ్యాయి. అదే తరహాలో మరో తమిళ కథానాయకుడు శివకార్తికేయన్ టాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని, నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు అనుదీప్ కేవీ శివ కార్తికేయన్ కి కధ చెప్పినట్టు జూలై నెలలో ప్రచారం జరిగింది.

ఈ సినిమా కూడా
ద్విభాషా చిత్రంగా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగిన ఈ సినిమా గురించి అధికారిక ప్రకటనను నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసారు. ముందు నుంచి ప్రచారం జరిగినట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ధనుష్ - శేఖర్ కమ్ముల సినిమాని నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఈ సినిమాని కూడా సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావులతో కలిసి నిర్మిస్తోంది.

ఏకంగా 25 కోట్లు
ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే సినిమా అనౌన్స్ మెంట్ వీడియో ఆసక్తికరంగా ఉంది. రెండు దేశాల మధ్య కథగా ఈ సినిమా కనిపిస్తోంది. అనౌన్స్ మెంట్ వీడియోలో పక్షిని హైలైట్ చేశారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్ రెమ్యునరేషన్ కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా చేసేందుకు గాను ఆయనకు రెమ్యునరేషన్ గా 25 కోట్ల మొత్తం తీసుకుంటున్నారని అంటున్నారు.

శివ కార్తికేయన్ కెరీర్ లో 20వ సినిమాగా
ఇక చివరిగా వరుణ్ డాక్టర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చిన శివ కార్తికేయన్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా తమిళంలో కాక తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న మరో రెండు సినిమాలు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మొత్తం మీద శివ కార్తికేయన్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











