రామ్ చరణ్ గేమ్ చేంజర్ బడ్జెట్ పై ఎస్ జె సూర్య షాకింగ్ కామెంట్స్
Game Changer: మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా ,స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ఈ పొలిటికల్ థ్రిలర్ మూవీ ప్రేక్షకుల ముందు రాబోతుంది. భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా.. గేమ్ చేంజర్ మూవీ బడ్జెట్ పై ప్రముఖ డైరెక్టర్, నటుడు, ఎస్. జె. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'. ఈ మూవీలో కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించగా.. అంజలి, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. భారీ బడ్జెట్ తో నిర్మాత దిల్‌రాజు ఈ మూవీని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైజర్, టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ పై ఇండస్ట్రీలో పలు ఇంట్రెస్టింగ్ కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కెరీర్లో ఇంతవరకు ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ పెట్టి సినిమాలో తీయలేదట. పైగా డైరెక్టర్ శంకర్ సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ కావడం, అలాగే దిల్ రాజు నిర్మించిన సినిమాలు కూడా ప్లాప్ కావడం, సినిమాలను నిర్మించడంలో దిల్ రాజు సరిగా జడ్జ్ చేయలేకపోతున్నారని ప్రచారం జరుగుతుంది.
ఈ తరుణంలో నటుడు ఎస్ కే సూర్య కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దిల్ రాజు సినిమా నిర్మాణంలో ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. కేవలం ఒక పాట చిత్రీకరణ కోసం 75 కోట్ల పైగా ఖర్చు చేసినట్లు ఒక్కొక్క రోజుకి దాదాపు 90 లక్షల వరకు ఖర్చు అయినట్లు ఎస్ జె సూర్య చెప్పుకొచ్చారు. ప్రతిరోజు భారీ సెట్స్ , భారీ కాస్టింగ్, వందల మంది నటులు పాల్గొనడం ఇలా ఈ సినిమాలో ఎన్నో అద్భుతాలను శంకర్ గారు చేశారని చెప్పారు. మీరు సినిమా టికెట్లకు పెట్టే డబ్బు ఒక్క గేమ్ చేంజర్ పాటతోనే న్యాయం జరుగుతుంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.

గేమ్ చేంజర్ కోసం దిల్ రాజు చాలా ఖర్చు పెట్టాడని, తనకు తెలిసినంతవరకు వడ్డీలతో సహా కలుపుకుంటే దాదాపు గేమ్ చేంజర్ బడ్జెట్ 400 కోట్ల నుండి 500 కోట్లకు చేరుకుంటుందని అన్నారు. వాస్తవానికి గేమ్ చేంజర్ మూడేళ్ల క్రితమే ప్రారంభమైంది కానీ, వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడింది చివరకు సంక్రాంతి రేసులో నిలిచి జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఒక రామ్ చరణ్ పేరు మీదే గేమ్ చేంజర్ బిజినెస్ జరుగుతోందట. అన్ని అనుకున్నట్లు ఈ మూవీ సక్సెస్ అయితే మాత్రం దిల్ రాజుకు తిరుగులేనట్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











