సరిపోదా శనివారం సినిమా స్టోరిని లీక్ చేసిన విలన్.. నాని మరోసారి కంటెంట్‌తో కొట్టబోతున్నాడా?

తెలుగు సినిమా దగ్గర తన సహజమైన నటనతో అదరగొట్టి నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఏకైక హీరో నాని ఇప్పుడు రెండు వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది తాను నటించిన చిత్రాలు రెండు థియేటర్స్ లోకి రిలీజ్ కి రాగ అవి రెండు మంచి హిట్స్ అయ్యాయి. కొత్త దర్శకులు శ్రీకాంత్ ఓదెల అలాగే శౌర్యువ్ తో చేసిన "దసరా" అలాగే "హాయ్ నాన్న" రెండు సెపరేట్ ట్రాక్ లు కాగా మాస్ అండ్ క్లాస్ తో అయితే నాని అదరగొట్టి మంచి కం బ్యాక్ ఇచ్చాడు.

అయితే నాని చిత్రాల్లో క్లాస్ సినిమాలకంటే మాస్ సినిమాలకే ఆదరణ గట్టిగా ఉంటుంది అని ఇది ప్రూవ్ కాగా లాస్ట్ దసరా సినిమాకి కూడా టైర్ 2 హీరోస్ లో అయితే తనకి తిరుగు లేదని ప్రూవ్ అయ్యింది. కాగా ఇప్పుడు మళ్ళీ నాని మరో మాస్ సినిమాతో వస్తున్నట్టుగా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యిపోయింది.

SJ Surya leaks Nani s Saripodhaa Sanivaaram story

తన దర్శకుడు వివేక్ ఆత్రేయతో "అంటే సుందరానికి" క్లాస్ సినిమా చేసి నాని భారీ ప్లాప్ అందుకోగా ఇప్పుడు ఇదే దర్శకుడితో మాస్ సినిమా చేసి హిట్ కొట్టాలి అని డిసైడ్ ఐపోయినట్టుగా ఈ చిత్రాన్ని తాను చేస్తున్నాడు. కాగా ఈ సినిమానే "సరిపోదా శనివారం" కాగా ఇపుడు దీనిపై క్రేజీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఈ సినిమాలో నాని రెండు షేడ్స్ లో కనిపించనున్నాడు అని ఆల్రెడీ అర్ధం అయ్యిపోయింది.

మరి అసలు ఈ సినిమా కథేంటి అనేది ప్రముఖ వెర్సటైల్ నటుడు లీక్ చేసేసాడు. కాగా ఈ సినిమాలో నానికి విలన్ గా తమిళ దర్శకుడు నటుడు కూడా అయినటువంటి ఎస్ జే సూర్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తానొక రూత్ లెస్ కాప్ గా కనిపించనున్నారు. అయితే తాను ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూలో అసలు సరిపోదా శనివారం లైన్ ఇదే అంటూ చేసిన కామెంట్ వైరల్ గా మారాయి.

SJ Surya leaks Nani s Saripodhaa Sanivaaram story

ఈ సినిమాలో హీరోకి విపరీతమైన కోపం ఉంటుంది. అందుకే తన అమ్మ అతన్ని అన్ని రోజులూ కోపంగా ఉండకూడదురా కావాలంటే అన్ని రోజుల కోపాన్ని ఒక్క రోజు చూపించు అని శనివారం నాడు ట్రై చెయ్ అన్నట్టుగా చెబుతుందట. అలా ఈ సినిమాకి సరిపోదా శనివారం అనే టైటిల్ వచ్చింది అని ఇది సినిమా లైన్ అంటూ ఎస్ జే సూర్య సినిమా తాలూకా మెయిన్ లైన్ ని లీక్ చేసేసాడు. దీనితో ఇది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇది సినిమా రిలీజ్ రోజు వరకు కానీ ఆపి ఉంటే డెఫినెట్ గా ఇంకో లెవెల్ రెస్పాన్స్ అందుకొని ఉండేది అని చెప్పాలి. కానీ సూర్య మాత్రం ముందే లీక్ చేసేసాడు. దీనితో మరోసారి నాని మంచి కంటెంట్ తో కొట్టబోతున్నాడు అని చెప్పాలి. ఇంకా ఈ చిత్రంలో నాని సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుండగా గ్యాంగ్ లీడర్ తర్వాత రెండో సినిమాగా ఆమె నాని సరసన నటిస్తుంది. అలాగే RRR నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఆగస్ట్ 29న పాన్ ఇండియా భాషల్లో విడుదలకి రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X