అకిరా నందన్‌తో ఖుషి 2.. ఎస్ జే సూర్య సెన్సేషన్ కామెంట్స్..

Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీ అయిపోయారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా అంతముందుకు కమిట్ అయిన సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అయితే.. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేశారా? లేదా? అనేది సందేహమే. ఒకవేళ పవన్ పాలిటిక్స్ కు ఫిక్స్ అయిపోతే.. తన తనయుడు అకిరా నందన్ ను సినీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ డిమాండ్. ఈ తరుణంలో అకిరా సినీ ఎంట్రీ పై ప్రముఖ డైరెక్టర్, నటుడు ఎస్ జె సూర్య సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ నట వారసుడు అకీరా సినీ ఎంట్రీపై ఏమన్నారంటే?

గత కొంత కాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో బిజీగా మారిపోయారు. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ, సమయం దొరికినప్పుడల్లా.. తాను ఒప్పుకున్న సినిమాలలో నటిస్తూ.. వాటిని పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఓజీ సినిమా షూటింగ్లో పవన్ పాల్గొంటూ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే 'హరివీరమల్లు' సినిమాను షూటింగ్ కూడా త్వరలో పూర్తి చేయబోతున్నట్లు టాక్. ఈ సినిమాలో పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలలో నటిస్తారా? లేదా ? అనేది చెప్పడం కష్టమే.

SJ suryah interesting comments on Khushi 2 with pawan kalyan son akira Nandan

ఒకవేళ పవన్ కళ్యాణ్ రాజకీయాలలోనే పూర్తిగా నిమగ్నమైతే.. పవన్ తనయుడు అకిరా నందన్ ను సినీ ఎంట్రీ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అకీరా సినీ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అకిరా అన్ని విధాలుగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు రాక కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే .. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఓజి' సినిమాలో ఆకీరా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

'ఓజీ' సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించగా.. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో అకిరా.. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్రలో నటించబోతున్నట్లు టాక్. అయితే.. అకీరా నటిస్తుంది? లేనిది? అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఒకవేళ అకిరా యాక్టింగ్ కు ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారు వేచి చూడాలి. ఇలా అకిరా నందన్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ప్రముఖ డైరెక్టర్, నటుడు ఎస్ జె సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

SJ suryah interesting comments on Khushi 2 with pawan kalyan son akira Nandan

తాజాగా స్టార్ యాక్టర్, డైరెక్టర్ SJ సూర్య మీడియా చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అకిరా నందన్‌తో ఖుషి 2 ఏమైనా ప్లాన్ చేస్తారా? అని ప్రశ్నించగా.. నటుడిగా జర్నీచాలా కంఫర్ట్ గా సాగుతోంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. లాస్ట్ టైం రాజమండ్రికి వెళ్లినప్పుడు.. అకిరా నందన్‌ను చూశాను. అతడిని ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ గారిలాగానే.. అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు. ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే.. అకిరా నంద‌న్‌తో ఖుషి సీక్వెల్ వ‌ర్క‌వుట్ అవుతుందేమో చూడాలి అని ఎస్‌జే సూర్య అన్నాడు.

గతంలో పవన్ కళ్యాణ్ తో ఖుషి 2 స్టోరీ డిస్కషన్స్ జరిగిన విషయం తెలిసిందే. కానీ, కొన్ని కారణాల వల్ల వర్కవుట్ కాలేదనీ అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే జీవిస్తున్నాడు. ఆయన ఆలోచనలు, విజన్ డిఫరెంట్ గా ఉన్నాయంటూ పేర్కొన్నారు. ఒకవేళ అన్నీ కలిసి వచ్చి .. అకిరా నందన్ తో ఖుషీ 2 సినిమా వర్కౌట్ అయితే.. మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మిల్సే. ఈ కాంబినేషన్లో ఖుషి 2 సినిమా రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

More from Filmibeat

Read more about: akira nandan kushi 2 sj suryah
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X