‘చచ్చిపోదామని ఫిక్స్ అయ్యా.. పవన్ కళ్యాణ్ కాపాడాడు’

తమిళ స్టార్ హీరో, ప్రముఖ డైరెక్టర్ ఎస్జే సూర్య తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపును దక్కించుకున్నారు. తన సినిమాలు, నటనతో ఆయనకంటూ టాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం నెగెటివ్ రోల్స్ లో తెలుగు చిత్రాల్లో నటిస్తూ దుమ్ములేపుతున్నారు. తన నట విశ్వరూపంతో కుమ్మేస్తున్నారు. ఆడియెన్స్ మరిచిపోలేని పాత్రలు పోషిస్తూ, ఆ పాత్ర తాలుకూ లక్షణాలను ఎప్పిటికీ గుర్తుండిపోయేలా చేస్తున్నారు. ఇక రీసెంట్ గానే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన 'వీర ధీర శూర' చిత్రంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పవర్ ఫుల్ పాత్రను పోషించారు. నెగెటివ్ షేడ్స్ తో దుమ్ములేపారు. మార్చి 27న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. తమిళంలో రూపుదిద్దుకున్న ఈ మూవీని తెలుగులోనూ డబ్డ్ వెర్షన్ లో విడుదల చేశారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో ఎస్జే సూర్య ఎవరూ ఊహించని షాకింగ్ న్యూస్ చెప్పారు.

SJ Suryah wanted to Committed Suicide

రీసెంట్ గా ఎస్జే సూర్య 'వీర ధీర శూర' మూవీ ప్రచార కార్యక్రమాల్లో తరుచుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఖుషి' సినిమా టాపిక్ వచ్చింది. ఆ ఎవర్ గ్రీన్ ఫిల్మ్ కు దర్శకుడు ఎస్జే సూర్యనే కావడం విశేషం. అయితే ఆ సినిమా సమయంలోని ఓ ఘటనను ఎస్జే సూర్య తన అభిమానులతో పంచుకున్నారు. ఆ సినిమాను పవన్ కళ్యాణ్ తో డైరెక్ట్ చేసిన తర్వాత థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యిందని, కానీ మొదట ఫస్ట్ కాపీని చెన్నైలోని ఉదయం థియేటర్ లో ప్రీమియర్ వేసినప్పుడు ఎలాంటి రియాక్షన్ రాలేదని చెప్పారు. దాంతో చాలా అప్సెట్ అయ్యాయని చెప్పారు.

అప్పుడు ఈ చిత్రం మాత్రం సక్సెస్ కాలేదని చాలా భయపడ్డానని, కానీ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ వల్ల సినిమాకు ఆ తర్వాత పాజిటివ్ టాక్ వచ్చిందని, లేదంటే మాత్రం సూసైడ్ చేసుకునే వాడినని చెప్పారు. ఆ సినిమా హిట్ కాకపోతే ఇప్పుడు మీ ముందు ఎస్జే సూర్య ఉండేవాడు కాదని చెప్పారు. ఎస్జే సూర్య మాటలు విన్నాక ఆయన సినిమా పట్ల ఎంత ఎమోషన్ కలిగి ఉంటారో అర్థమవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఎస్జే సూర్య బ్యాక్ టు బ్యాక్ మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఎస్జే సూర్య ను 'ఖుషి2' కూడా డైరెక్ట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఎస్జే సూర్య కూడా ఖుషి2 ను డైరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, పవన్ కళ్యాణ్ సార్ డేట్స్ ఇస్తే సరిపోద్దని చెప్పారు.

ఇక ఎస్జే సూర్య సరిపోదా శనివారం, ఇండియన్ 2, గేమ్ ఛేంజర్, రాయన్, వీర ధీర సూరన్ వంటి చిత్రాలతో అలరించారు. నెక్ట్స్ ఇండియన్ 3, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, సర్దార్ 2 వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజా పరిపాలన చూస్తున్నారు. మరోవైపు 'హరి హర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాల్లో నటిస్తున్నారు. మే9న హరిహర వీరమల్లు చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Read more about: sj suryah pawan kalyan kushi 2001
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X