Skanda మూవీపై ఫేక్ రివ్యూలకు చెక్.. డైరెక్టర్ బోయపాటి శ్రీను సంచలన నిర్ణయం

సినిమా పరిశ్రమలో సోషల్ మీడియాలోను, అలాగే యూట్యూబ్‌‌లోను మూవీ రిలీజ్‌కు ముందే రివ్యూలు కుప్పలుతెప్పలుగా వస్తుండటం సినీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఇటీవల చాలా సినిమాల రిలీజ్‌కు ముందే ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ రివ్యూలతో హడలెత్తించారు. ఈ విషయాలను, ఇలాంటి విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బోయపాటి శ్రీను సంచలన నిర్ణయం తీసుకొన్నారు. బోయపాటి శ్రీను తీసుకొన్న నిర్ణయం ఏమిటంటే?

ఉస్తాద్ రామ్ పోతినేని, అందాల తార శ్రీలీల జంటగా నటించిన చిత్రం స్కంద సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా, పవన్ కుమార్ సమర్పకుడిగా ఈ సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, కాలకేయ ప్రభాకర్ తదితరులు నటించారు.

Skanda Director Boyapati Srinu Check to fake Review: Overseas premiere shows along with AP, Nizam shows on September 28th

అయితే స్కంద సినిమాను ఫేక్ రివ్యూల నుంచి తప్పించడానికి బోయపాటి శ్రీను తెలివైన నిర్ణయం తీసుకొన్నారు. సాధారణంగా ఇండియాలో రిలీజ్ కంటే ముందే ఒకరోజు ప్రీమియర్లు అమెరికాలో ప్రదర్శిస్తారు. కానీ స్కంద మూవీ విషయంలో 27వ తేదీన రాత్రి కాకుండా 28వ తేదీ తెల్లవారు జామున భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు అమెరికాలో ప్రదర్శించే విధంగా నిర్ణయం తీసుకొన్నారు.

స్కంద మూవీ ప్రీమియర్లను రద్దు చేసిన బోయపాటి శ్రీను.. ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే ఫస్ట్ షో ఉదయం 7 గంటలకు ప్రారంభం కాబోతున్నది. అంతే అమెరికా, తెలంగాణ, నైజాంతోపాటు రివ్యూలు 10 గంటల తర్వాతే వస్తాయి. 10 గంటల తర్వాత వచ్చే రివ్యూలే వాస్తవ రివ్యూలుగా పరిగణించాలని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతున్నది.

Skanda Director Boyapati Srinu Check to fake Review: Overseas premiere shows along with AP, Nizam shows on September 28th

అమెరికాలో ప్రదర్శించే ప్రీమియర్ల కారణంగా తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో ప్రదర్శించే షోలపై అక్కడి టాక్ ప్రభావం చూపుతున్నది. కాబట్టి స్కంద మూవీపై ఫేక్ రివ్యూలు వేయకుండా తప్పించుకొనేందుకు బోయపాటి శ్రీను ఓ ప్రయత్నం చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా కొందరు హీరోలు, డైరెక్టర్లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ రివ్యూలు వేస్తున్నారు. అలాంట వాటికి చెక్ పెట్టేందుకు బోయపాటి తీసుకొన్న నిర్ణయం ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X