Skanda Censor Review రామ్, శ్రీలీల కేక.. బోయపాటి రెగ్యులర్ మార్క్ మూవీ.. అవి కనెక్ట్ అయితేనే!
ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని, టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం స్కంద. సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్‌ను 28వ సెప్టెంబర్‌కు మార్చారు. ఈ సినిమా గురించి ఇన్‌సైడ్ రిపోర్టు వివరాల్లోకి వెళితే..
50 కోట్ల బడ్జెట్‌తో:ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందిన స్కంధ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను సుమారుగా 50 కోట్ల రూపాయలతో తెరకెక్కించినట్టు సమాచారం. ఈ సినిమా కోసం తమన్ అందించిన పాటలు మ్యూజిక్ చార్ట్స్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.

ఫస్టాఫ్ రిపోర్టు ఎలా ఉందంటే? :స్కంధ ఓవర్సీస్ సెన్సార్ విషయానికి వస్తే.. ఫస్టాఫ్ బాగుంది అనే టాక్ బయటకు వచ్చింది. ఫస్టాఫ్‌లో హీరోయిన్ శ్రీలీలతో రామ్ లవ్ ట్రాక్, కామెడీ సీన్లతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ ఫస్టాఫ్‌కు హైలెట్ అనేది చెబుతున్నారు. ఫస్టాఫ్‌లో యాక్షన్ ఎపిసోడ్స్‌కు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేక పెడుతుంది అని తెలిసింది.

సెకండాఫ్ రిపోర్టు ఎలా ఉందంటే?:స్కంధ సెకండాఫ్ విషయానికి వస్తే.. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సినిమా ముందుకు సాగుతుంది. సెకండాఫ్‌లో కల్ట్ మామా సాంగ్, ఆ పాటలో డ్యాన్సులు హైలెట్‌గా ఉంటాయి. రామ్ పోతినేని, శ్రీలీల పోటీపడి డ్యాన్స్ చేశారు. స్కంద చివరి 20 నిమిషాలు వచ్చే కంటెంట్ ఫ్యాన్స్‌ను కేక పెట్టిస్తుంది అనే రిపోర్టు బయటకు వచ్చింది.

బోయపాటి రెగ్యులర్ స్టయిల్‌లో:స్కంద మూవీ మాస్, మసాలా అంశాలతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండే చిత్రంగా ఉంటుంది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ఏమాత్రం తీసిపోదు. కమర్షియల్ వాల్యూస్, ఫ్యామిలీ ఎమోషన్స్ వర్కవుట్ అయితే, ప్రేక్షకులకు కనెక్ట్ అయితే పెద్ద హిట్ అవుతుంది అని సెన్సార్ రిపోర్టు.

నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, ప్రిన్స్ సెసిల్, శరత్ లోహితాస్వ, అజయ్ పుర్కార్, ప్రభాకర్, దగ్గుబాటి రాజా, శ్రీకాంత్, బబ్లూ పృథ్వీరాజ్, ఇంద్రజ, ఊర్వశీ రౌటేలా తదితరులు
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
డైలాగ్స్: ఎం రత్నం
సినిమాటోగ్రఫి: సంతో డీటేక్
ఎడిటింగ్: తమ్మిరాజు
మ్యూజిక్: ఎస్ తమ్మిరాజు
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్
సినిమా నిడివి: 167 నిమిషాలు
రిలీజ్ డేట్: 2023-08-28


Click it and Unblock the Notifications











