BoyapatiRAPO: రామ్ మూవీకి ఊహించని టైటిల్.. అఖండ తర్వాత అదే దారిలో!
చాలా కాలం పాటు సరైన హిట్ లేక ఇబ్బంది పడినా.. 'ఇస్మార్ట్ శంకర్', 'రెడ్' చిత్రాలతో వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టాడు హీరో రామ్ పోతినేని. ఈ జోష్‌లోనే గత ఏడాది అతడు 'ది వారియర్' అనే చిత్రంతో వచ్చాడు. కానీ, ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ హిట్‌ను అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్‌గా పేరొందిన బోయపాటి శ్రీనుతో కలిసి ఓ సినిమాను చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ స్థాయిలో హైప్ ఏర్పడింది.
పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అప్పటి నుంచి కొన్ని బ్రేకులు వచ్చినా దీన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇలా ఇటీవలే ఈ చిత్రంలోని క్లైమాక్స్ పార్టును దాదాపు 20 రోజుల పాటు భారీ మొత్తాన్ని ఖర్చు చేసి మరీ షూట్ చేసుకున్నారు.

ఆ తర్వాత కర్నాటకలో మరో షెడ్యూల్ చేశారు. ఇలా దాదాపుగా ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన పనులను కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది.
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఇక, ఇప్పుడు ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీన్ని జూన్ 28న రివీల్ చేయబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, ఈ చిత్రానికి 'స్కంద' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో బాలయ్యకు 'అఖండ' వంటి ఆధ్యాత్మికమైన పేరుతో సక్సెస్ సాధించిన బోయపాటి.. మరోసారి డివోషనల్ టైటిల్‌నే ఎంపిక చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉండగా.. బోయపాటి శ్రీను - రామ్ పోతినేని కాంబోలో వస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ నుంచి ఓ వీడియో రిలీజ్ అయింది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో పాటు అంచనాలు కూడా గణనీయంగా పెరిగాయి.


Click it and Unblock the Notifications











