twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ 2020కి నామినేట్ అయిన... 9 ఏళ్ల తమిళ అమ్మాయి షార్ట్ ఫిల్మ్!

    |

    తమిళనాడుకు చెందిన 9 ఏళ్ల అమ్మాయి కమలి మూర్తి వార్తల్లో వ్యక్తిగా మారింది. స్కేట్ బోర్డింగ్ చేసే కమలి, ఆమె తల్లి జీవితంపై చిత్రీకరించిన ఓ షార్ట్ ఫిల్మ్ అకాడెమీ(ఆస్కార్) అవార్డ్స్ 2020లో షార్ట్ లిస్ట్ అవ్వడమే ఇందుకు కారణం. 'కమలి' పేరుతో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ కమలి మదర్ సుగంతి జీవితం చుట్టూ తిరుగుతుంది.

    సింగిల్ మదర్ అయిన సుగాంతి కట్టుబాట్లతో కూడిన సమాజంలో స్ట్రగుల్ అవుతూ తన కూతురుని ఎలా పెంచింది, ఆ చిన్నారిని స్కేట్ బోర్డ్ చాంపియన్ చేయడంలో ఎలా ముందు సాగింది అనేది చూపించారు. 24 నిమిషాల నిడివిగల ఈ షార్ట్ ఫిల్మ్.. న్యూజిలాండ్‌కు చెందిన శేషా రెయిన్‌బో దర్శకత్వంలో రూపొందింది.

    Skateboarding star Kamali Moorthy film Kamali shortlisted for Oscars 2020

    ఆరు వారాల పాటు ఈ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ జరిగింది. చిత్రీకరణ పూర్తయిన తర్వాత ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌కు పంపగా బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దక్కించుకుంది. ఏప్రిల్ మాసంలో జరిగిన అట్లాంటా ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు సొంతం చేసుకుంది.

    ఆడ పిల్ల కావడం వల్ల తాను చిన్నతనంలో సమాజంలోని కట్టుబాట్ల కారణంగా ఎన్నో కోల్పోయాను. అయితే నా కూతురు విషయంలో అలాంటి పరిస్థితి లేకుండా తన ఇష్ట ప్రకారం స్వేచ్ఛాయుత వాతావరణం ఉండేలా నా వంతు ప్రయత్నం చేస్తున్నట్లు సుగంతి తెలిపారు. ఈ షార్ట్ ఫిల్మ్‌కు ఇన్ని అవార్డులు దక్కడం తన జీవితంలో బిగ్గెస్ట్ అచీవర్మెంటుగా పేర్కొన్నారు.

    English summary
    A short film titled Kamali, based on Kamali Moorthy, the nine-year-old skateboarding girl and her mother's life, has been shortlisted for the 2020 Academy Awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X