twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2 ఇస్కాన్ అధినేత చేతుల మీదుగా టీజర్ రిలీజ్.. హీరో నిఖిల్ సిద్దార్థకు అరుదైన గౌరవం

    |

    యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న కార్తికేయ 2. గతంలో ఘన విజయం సాధించిన కార్తీకేయ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నిఖిల్‌ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకొన్నారు. కృష్ణతత్వంపై రూపొందిన సినిమా అని తెలిసి ఇస్కాన్ సంస్థ నిఖిల్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపింది.

    కార్తీకేయ 2 సినిమాపై ఇస్కాన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా కార్తికేయ 2 చిత్రయూనిట్‌కు ఇస్కాన్ అత్యున్నత సంస్థానం బృందావన్‌కు రావాలంటూ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ గారి నుంచి ఆహ్వానం లభించింది. ఇస్కాన్ దేవాలయాలు కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. దేశదేశాల్లో.. ఖండఖండాంతరాలుగా వ్యాపించి ఉన్న విషయం తెలిసిందే. ఆస్ట్రియా లాంటి దేశాల నుంచి మొదలుపెట్టి ఎన్నో వందల దేశాల్లో ఇస్కాన్ టెంపుల్స్ కొలువై ఉన్నాయి. అంతటి ప్రగ్యాతి గాంచిన ట్రస్ట్ నుంచి కార్తికేయ 2 టీమ్‌కు ఆహ్వానం లభించడం నిజంగా గర్వించదగ్గ విషయం.

    SKCON Vice President Radharam Das invited Karthikeya 2 unit and Nikhil Siddartha

    భారతీయ సినిమా ప్రపంచంలో ఇప్పటి వరకు ఇతిహాసాల నేపథ్యంతో, మైథలాజికల్ స్టోరీస్‌ నేపథ్యంతో ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. మహాభారతం, భాగవతం, రామాయణాలపై సినిమాలతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సీరియల్స్ రూపొందాయి. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణతత్వం, లీల కథా నేపథ్యంగా రూపొందించిన యూనిట్‌కు భారతీయ సినీ చరిత్రలో ఎవరికీ దక్కని గౌరవం కార్తికేయ 2 మూవీ టీంను వరించింది.

    SKCON Vice President Radharam Das invited Karthikeya 2 unit and Nikhil Siddartha

    ద్వాపరయుగంలో కృష్ణభగవానుడు బోధించిన సారాంశం ఏంటి అనే ప్రధాన పాయింట్‌గా కార్తికేయ 2 సినిమా ఉండనున్నది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.ఈ సందర్భంగా అన్ని భాషల్లో టీజర్‌ను ఇస్కాన్ సంస్థ వైఎస్ ప్రసిడెంట్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. మధుర, బృందావనం లాంటి పుణ్యక్షేత్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన అనని భాషల టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

    English summary
    Karthikeya 2 team has achieved a rare honour that no movie to date in the Indian film industry got. International Society For Krishna Consciousness(ISKCON) Vice President and spokesperson Radharam Das has invited the movie team to the headquarters of the organization. It is in Brindavan, Madhura.. a place where Lord Krishna was born and is said to be still doing the eternal dances with his devotees from Dwaparyuga. The hero of Karthikeya 2, Nikhil Siddartha has announced this on Twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X