'బ్రోచేవారెవరురా' చూసేసిన నాని.. నవ్వులే నవ్వులు అంటూ స్మాల్ రివ్యూ
Recommended Video
కొన్ని సినిమాలు ఊహించని రీతిలో ఆకట్టుకుంటాయి. ఎలాంటి హడావిడి లేకుండానే ప్రేక్షకుల మనసు దోచేస్తుంటాయి. అలంటి సినిమాలు చేయడంలో ప్రత్యేకమైన హీరో శ్రీ విష్ణు. ఇప్పటివరకు ఆయన నటించిన అన్ని సినిమాలు కూడా విలక్షణతో కూడుకొని సరికొత్త కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అదే కోవలో శ్రీ విష్ణు తాజా సినిమా 'బ్రోచేవారెవరురా' జూన్ 28 వ తేదీ (ఈ రోజే) విడుదల కానుంది. అయితే ఈ సినిమాను ఒక రోజు ముందుగానే చూసిన హీరో నాని.. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
కడుపుబ్బా నవ్విస్తుంది.. నాని స్మాల్ రివ్యూ
ఇప్పుడే 'బ్రోచేవారెవరురా' సినిమా చూశా. ఉల్లాసమైన కథాంశం. కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి కామెడీ మూవీ నేను చూడలేదు. శ్రీ విష్ణు, నివేదా థామస్, సత్య, నివేతా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి అందరూ సూపర్ పెర్ఫార్మ్ చేశారు. డైరెక్షన్, మ్యూజిక్‌తో ఇద్దరు వివేక్‌లు అదరగొట్టారు. మీ అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు నాని.

డిఫరెంట్ మూవీ 'బ్రోచేవారెవరురా'
'మెంటల్ మదిలో' ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బ్రోచేవారెవరురా'. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి 'చలనమే చిత్రము.. చిత్రమే చలనము' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్‌గా నటించగా.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు.

సినిమా గురించి శ్రీ విష్ణు ఏమన్నాడంటే..
నేను కేవలం ఆడపిల్లల కోసం బ్రోచేవారెవరురా సినిమా చేశా. ప్రతి అమ్మాయి ఓ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. అదేంటన్నది ఈ సినిమాలో చూపించబోతున్నాం. నవ్వులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏడుపుగొట్టు సినిమా కాదు అన్నాడు. ఆయన చెప్పినట్టుగానే తాజాగా ఈ సినిమా గురించి నేచురల్ స్టార్ నాని కూడా చెప్పడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.

మంచి టాక్ వస్తే టర్నింగ్ మూవీ
ఈ రోజే విడుదల కాబోతున్న ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిందంటే శ్రీ విష్ణు కెరీర్ ని మలుపు తిప్పే సినిమా ఇదే అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. విడుదలకు ముందే నాచురల్ స్టార్ నాని ప్రశంసలు దక్కాయి కాబట్టి బ్రోచేవారెవరురా సూపర్ హిట్ కావడం ఖాయం అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











