పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యువ జంట.. లాక్‌డౌన్ సమయంలో..

కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో టెలివిజన్ తారలు ఓ పండంటి బిడ్డకు జన్మినిచ్చారు. హిందీ టెలివిజన్ తెరపై రాణిస్తున్న స్మృతి ఖన్నా, గౌతమ్ గుప్తా జంట ఏప్రిల్ 15వ తేదీన పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు ధృవీకరించారు. మేరి ఆషికీ తుమ్ సే హీ సీరియల్‌లో జంటగా నటిస్తున్న ఈ దంపతులు తమ కుటుంబంలోకి ఓ పండంటి అమ్మాయిని స్వాగతించారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మా ఇంటిలోకి ఏప్రిల్ 15వ తేదీ 2020 రోజున ఓ యువరాణి అడుగుపెట్టింది అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. చిన్నారిని తమ ఒడిలో పెట్టుకొన్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. ఇది ఓ తండ్రికి కొండంత ఆనందం అంటూ తన సందేశాన్ని షేర్ చేశారు.

Smriti Khanna, Gautam Gupta blessed with baby girl

ఇటీవల గౌతమ్ తన జన్మదినాన్ని జరుపుకొన్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు బర్త్ డే గిఫ్టు ఇవ్వడం కొంత ఆలస్యమైంది. ఏ క్షణంలోనైనా బిడ్డ నీకోసం రావొచ్చు అంటూ కొద్ది రోజుల క్రితం స్మృతి వెల్లడించడంతో త్వరలోనే ఆమె ప్రసవించనున్నారనే విషయం ప్రేక్షకులకు తెలిసింది.

స్మృతి ఖన్నా, చిన్నారి ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం ఆ ఇంటిలో సంతోషం, ఆనంద క్షణాలు నిండి ఉన్నాయి అని సన్నిహితులు తెలిపారు. ఈ యువ జంటకు సన్నిహితులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X