Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో Expiry Date వెబ్ సిరీస్.. స్నేహా ఉల్లాల్ గ్రాండ్ ఎంట్రీ
నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన మొట్టమొదటి ద్విభాషా వెబ్ సిరీస్ ఎక్స్పైరీ డేట్. స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2న జీ 5లో హిందీ వెర్షన్ ఎక్స్ క్లూజివ్ గా విడుదల చేశారు. ఈ నెల 9న తెలుగు వెర్షన్ విడుదల కానున్న నేపథ్యంలో శుక్రవారం ట్రైలర్ విడుదల చేశారు.
లవ్ అఫైర్లు, చీకటి సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆసక్తికరమైన కథతో తెరకెక్కిందనే విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. రిలేషన్షిప్స్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో మూవీ రూపొందింది. డిసెంబర్ 17న గుంటూరులో అగర్వాల్ పెళ్లికి వెళ్లిన తన వైఫ్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో టోనీ లూక్ కంప్లైంట్ ఇవ్వడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. తన భర్త కనపడడం లేదని మరో మహిళ కంప్లైంట్ ఇస్తుంది. అతడు కూడా అదే పెళ్ళికి వెళతాడు. వాళ్ళిద్దరికి సంబంధం ఉందా? అనే విషయం వెబ్ సిరీస్ ట్రైలర్లో ఆసక్తిని రేపుతున్నది.
వివాహేతర సంబంధాలు, భార్యాభర్తల మధ్య ద్రోహం, మోసం, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఊహించని మలుపులతో సాగుతుందని 'జీ 5' వర్గాలు తెలిపాయి. ఎక్స్పైరీ డేట్‌తో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ డిజిటల్ తెరంగేట్రం చేస్తున్నారు.
ట్రైలర్ విడుదలైన సందర్భంగా స్నేహా ఉల్లాల్ మాట్లాడుతూ.. భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. మొత్తం పది ఎపిసోడ్స్‌తో సిరీస్ ఉంటుంది. ఇందులో చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్, ఊహించని మలుపులు ఉంటాయి అని అన్నారు.
వెబ్ సిరీస్ నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ "తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన తొలి వెబ్ సిరీస్ 'ఎక్స్పైరీ డేట్'. రెండు భాషల్లోని ప్రతిభావంతులైన నటీనటులతో దీన్ని రూపొందించాం. అందరూ అద్భుతంగా నటించారు. 'జీ 5'లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ను నిర్మించినందుకు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.