పవన్ సినిమా నుంచి షాకింగ్ అప్‌డేట్: ఫ్యాన్స్‌లో కలవరం.! కారణమేమిటంటే?

By Manoj

సినీ ఇండస్ట్రీలో సత్తా చాటడంతో పాటు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని చూపించి పాపులర్ అయ్యాడు. కెరీర్ ఆరంభంలోనే వైవిధ్యమైన సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక, సమాజ సేవ చేయడంలోనూ ముందుండే పవన్.. కొన్నేళ్ల కిందట రాజకీయాల్లోకి వెళ్లాడు. చాలా గ్యాప్ తర్వాత ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో పవర్ స్టార్ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం.!

గాసిప్ అనుకుంటే.. లీకులు నిరూపించాయి

గాసిప్ అనుకుంటే.. లీకులు నిరూపించాయి

సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని పవన్‌పై చాలా మంది నిర్మాతలు ఒత్తిడి తెస్తున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ, ఆయన మాత్రం రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. అయినప్పటికీ పవన్ సినిమాల్లోకి వస్తున్నారని జోరుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఆయన మాత్రం స్పందించలేదు. అయితే, షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఫొటోల వల్ల ఇది నిజమేనని తేలింది.

పవన్ కల్యాణ్ డేరింగ్ డెసీషన్.. అంతా ఆశ్చర్యం

పవన్ కల్యాణ్ డేరింగ్ డెసీషన్.. అంతా ఆశ్చర్యం

వాస్తవానికి పాపులర్ హీరో.. చాలా గ్యాప్ తర్వాత సినిమాల్లోకి వస్తున్నాడంటే దానిపై ఎన్నో అంచనాలు ఉంటాయి. దీంతో సదరు హీరో కూడా పక్కా కమర్షియల్ సినిమా చేయాలని భావిస్తాడు. కానీ, పవన్ మాత్రం అందుకు భిన్నమైన డెసీషన్ తీసుకున్నాడు. కమర్షియాలిటీ కంటే కథకు ప్రాధాన్యం ఉన్న సినిమానే ఎంచుకుని అందరినీ ఆశ్చర్య పరిచాడు.

పవన్‌కు గ్యాప్.. ముగ్గురితో కానిచ్చేస్తున్నారు

పవన్‌కు గ్యాప్.. ముగ్గురితో కానిచ్చేస్తున్నారు

బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి పవన్ చేయాల్సిన షూటింగ్ కొంత భాగం పూర్తయింది. దీంతో ఆయన గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం చిత్రంలోని ముగ్గురు హీరోయిన్లతో పాటు మిగిలిన నటీనటుల పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు.

పవన్ కల్యాణ్ సినిమా నుంచి షాకింగ్ అప్‌డేట్

పవన్ కల్యాణ్ సినిమా నుంచి షాకింగ్ అప్‌డేట్

తాజాగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... ఇప్పటికే ఈ సినిమా రూపొందిన రెండు భాషల్లో జరగని విధంగా.. ఇందులో మార్పులు చేస్తున్నారట. బలమైన కథ కావడంతో హీరో ఎలివేషన్ సీన్స్ కోసం హిందీ, తమిళ దర్శకులు సాహసం చేయలేదు. కానీ, తెలుగులో మాత్రం పవన్‌ను హైలైట్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

Recommended Video

Pawan Kalyan Calls Comedian Ali To Act In #PSPK26| Filmibeat Telugu
ఇక్కడ మాత్రమే అలా.. దర్శకుడిపై ఒత్తిడి

ఇక్కడ మాత్రమే అలా.. దర్శకుడిపై ఒత్తిడి

హిందీలో అమితాబ్, తమిళంలో అజిత్ పోషించిన పాత్రనే తెలుగులో పవన్ చేస్తున్నాడు. ఆ రెండు చోట్లా హీరో పాత్ర బలంగా ఉన్నప్పటికీ.. కథను మించిన ప్రాధాన్యం ఉండదు. అయితే, తెలుగులో పవన్ రీఎంట్రీ మూవీ కావడంతో దర్శకుడు ఆయనను హైలైట్ చేస్తున్నాడని తెలుస్తోంది. దీంతో సినిమా సోల్ మిస్ అయితే ఎలా అని ఫ్యాన్స్ కలవరపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X