మహేశ్ బాబు సినిమానా? వెంటనే రిజెక్ట్ చేసిన స్టార్ హీరో!
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రాల్లో హాలీవుడ్ రేంజ్ ఉన్న చిత్రం అతడు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలిచిత్రం ఇది. ఈ సినిమా విడుదల సమయంలో సెన్సార్ బోర్డు హాలీవుడ్ స్టైల్ మేకింగ్ అంటూ టీమ్ ను ప్రశంసించడం విశేషం.
ఇక ఈ చిత్రం వచ్చి 20 ఏళ్లు పూర్తైన ఇప్పటికీ ప్రేక్షకులను మెప్పించగల చిత్రమిది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు నటించాల్సి ఉండింది. కానీ ఆయన రిజెక్ట్ చేశారంట. ఈ విషయాన్ని నిర్మాత మురళీ మోహన్ తాజాగా వెల్లడించారు. శోభన్ బాబు ఎందుకు రిజెక్ట్ చేశారనే వివరాల్లోకి వెళితే..

మాస్టర్ పీస్ గా అతడు..
ఇటు మహేశ్ బాబు కెరీర్ లోనూ, అటు దర్శకుడు త్రివిక్రమ్ కెరీర్ లోనూ అతడు చిత్రం మాస్టర్ పీస్ గా మిగిలింది. ఇప్పటి వరకు మహేశ్ బాబు కెరీర్ లో అతడు, ఆ తర్వాత పోకిరీ మినహా అలాంటి బొమ్మ మళ్లీ రిపీట్ కాలేదు. అతడు చిత్రంలో నందు పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయింది. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్, క్యారెక్టరైజేషన్, అటిట్యూడ్ 2 దశాబ్దాల తర్వాత కూడా మెప్పిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రంలో మహేశ్ బాబు తర్వాత పార్థు తాత సత్యనారాయణ మూర్తిగా నాజర్ నటించిన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ పాత్రలో టాలీవుడ్ సీనియర్ హీరో, అందగాడు శోభన్ బాబు నటించాల్సి ఉండింది. కానీ ఆయన రిజెక్ట్ చేశారంట.
శోభన్ బాబు సమాధానం..
తాజాగా అతడు రీరిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. రీరిలీజ్ కూడా అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అతడు చిత్రంలో నాజర్ పాత్ర కోసం ముందుగా శోభన్ బాబును సంప్రదించినట్టు మురళీ మోహన్ చెప్పారు. ఆయన ఆయన ముసలివాడిగా కనిపించడం తనకు ఇష్టం లేదని మహేశ్ బాబు సినిమాను రిజెక్ట్ చేశారంట. ప్రేక్షకులు తనను ఆ నాటి స్టైలిష్ లుక్ నే గుర్తు పెట్టుకోవాలని ఆయన కోరిక అంట. అందుకే సత్యనారాయణ మూర్తి పాత్రను చేయనని సున్నితంగా చేయనని చెప్పారని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.
అతడు బాక్సాఫీస్ కలెక్షన్స్..
2005 ఆగస్టు 10న అతడు చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి టాలీవుడ్ సీనియర్ నటుడు, రియల్టర్ మురళీ మోహన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ లో గ్రాండ్ గా నిర్మించారు. ఈ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సెన్సేషన్ గా మారింది. తెలుగుతో పాటు ఓవర్సీస్ లోనూ విడుదలై మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 205 సెంటర్లలో 50 రోజుల, 38 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది. టోటల్ రన్ లో ఈ చిత్రం 22 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేయడం విశేషం.


Click it and Unblock the Notifications











