కాబోయే భర్తపై శోభిత కామెంట్స్.. చైతునే అంటున్న నెటిజన్లు?

తెలుగు అమ్మాయిగా శోభితా దూళి పాళ్ల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చి నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోతో కుర్రకారు గుండెల్లో మంట పుట్టించింది. హీరో అడవి శేష్ నటించిన గూడచారి సినిమాలో హీరోయిన్‌ గా శోభిత దూళిపాళ్ల నటించి అందరి మెప్పును పొందింది. ఇక అక్కినేని నాగచైతన్యతో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు శోభిత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే...

అడవి శేష్ సినిమాతో ఎంట్రీ: శోభితా దూళిపాళ్ల నవాజుద్దీన్ సిద్దిఖీ హీరోగా తెరకెక్కిన రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో బాలీవుడ్‌ లో అడుగుపెట్టింది. అక్కడ అందాల ఆరబోతతో హీటెక్కించింది. ఇక హీరో అడివి శేష్ ఆమెను టాలీవుడ్ కి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అడవి శేష్ నటించిన గూఢచారి, మేజర్ సినిమాల్లో శోభిత నటించి మెప్పించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

Sobhita Dhulipala

బిజీ బిజీగా శోబితా దూళి పాళ్ల: ఇక శోభిత దూళిపాళ్ల పలు భాషల్లో నటిస్తూ బిజీ బిజీగానే ఉంది. అయితే శోభితకు ఈ మధ్య మరింత పాపులారిటీ అయితే వచ్చింది. దానికి కారణం అక్కినేని నాగ చైతన్యతో శోభితకు అఫైర్ ఉందంటూ.. కథనాలు వెలువడ్డాయి. దానికి తగ్గట్లుగానే వీరిద్దరూ కలిసి తిరిగినట్లు ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక ఈ విషయంపై ఈ భామ కానీ.. అక్కినేని హీరోగాని స్పందించలేదు.

Sobhita Dhulipala

సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారా: ప్రస్తుతం ది నైట్ మేనేజర్ 2 సినిమాలో నటిస్తోంది శోభిత. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఆమె.. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పింది. తన భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో ఇన్ డైరెక్టుగా హింట్ ఇచ్చేసింది ఈ భామ. సమంతతో బ్రేకప్ అయ్యాక నాగ చైతన్యతో శోభిత కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమెతో చైతూ సీక్రెట్‌గా డేటింగ్‌ లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య కొత్తగా కట్టిన ఇంటికి శోభితను కూడా చాలా సార్లు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
Sobhita Dhulipala

సోషల్ మీడియాలో వైరల్ గా: ఇటీవల నాగ చైతన్య శోభిత ధూళిపాళ లండన్ లో డిన్నర్ కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగ చైతన్యతో డేటింగ్ గురించి జరుగుతున్న చర్చల గురించి శోభిత మాట్లాడుతూ.. అవన్నీ అవాస్తవాలు అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ది నైట్ మేనేజర్ 2 సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న శోభితా ధూళిపాళ తన కాబోయే భర్త ఎలా ఉండాలనే దాని గురించి మాట్లాడింది.
Sobhita Dhulipala

త్వరలో పెళ్లి చేసుకోనున్నారా..:కాబోయే భర్త జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఇతరులకు అండగా ఉండాలని చెప్పుకొచ్చింది శోభిత. చాలా సాధారణ వ్యక్తి అయి ఉండాలట. చిన్న, చిన్న ఆలోచనలను అర్థం చేసుకోగలగాలని చెబుతోంది. అదే సమయంలో నాగ చైతన్యతో తనకున్న సీక్రెట్ రిలేషన్ గురించి కూడా పరోక్షంగా మాట్లాడి.. అవన్నీ ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే నెటిజన్లు మాత్రం వీరు ప్రేమలో ఉన్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోనుంది అని భావిస్తున్నారు. చూడాలి ఇక.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X