Sobhita: శోభిత.. నాగచైతన్యకు కాస్త అది నేర్పించండి.. చందూ మొండేటి సలహ
యువ సామ్రాట్ నాగచైతన్య, టాలెంటెడ్ యాక్టర్ సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు బాక్సాఫీస్ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకొంటూ భారీ విజయం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుక గురించిన వివరాల్లోకి వెళితే..
తండేల్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం వైపు అడుగులేస్తున్న క్రమంలో లవ్ సునామీ సెలబ్రేషన్స్ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకలో కింగ్ నాగార్జున, స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ముఖ్య అతిథులుగా, శోభితా ధూళిపాల ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈవెంట్‌లో తండేల్ చిత్ర యూనిట్ సభ్యులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు చందూ మొండేటి ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆయన తన స్పీచ్‌లో నాగచైతన్యకు కొన్ని సూచనలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ సలహాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..

చందూ మొండేటి మాట్లాడుతూ.. నాగచైతన్యతో భవిష్యత్‌లో మరో హిస్టారికల్ నేపథ్యంతో సినిమా చేస్తాను. గతంలో అక్కినేని నాగేశ్వరరావు తెనాలి రామకృష్ణగా నటించారు. ఆయన తన నటనతో ఆ పాత్రకు స్క్రీన్‌పై వన్నె తెచ్చారు. అలాంటి తరహాలో చైతూతో చారిత్రతక నేపథ్యం ఉన్న సినిమాను రూపొందించాలని అనుకొంటున్నాను. కాకపోతే తెలుగుపై చైతూ పట్టు సాధించేలా కృషి చేయాల్సి ఉంటుందనే విధంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా వేదిక వద్ద ఉన్న శోభిత గురించి మాట్లాడుతూ.. శోభితకు తెలుగుపై మంచి అవగాహన ఉంది. ఆమె తెలుగు భాషను చక్కగా మాట్లాడుతుంది. ఆ భాషను చైతూ కూడా మాట్లాడేలా తన వంతు సహకారం అందించాలి. శోభిత మాదిరిగానే చైతూ కూడా తెలుగుపై పట్టు సాధించాలి అని చందూ మొండేటి అన్నారు. తండేల్ జోష్‌తో చైతూతో కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్ సెట్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నది.
నాగచైతన్యతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మరింత వివరణ ఇస్తూ.. ఆ సినిమా కథను గొప్పగా రాసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ తరం వారిని కూడా ఆ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీ అలరించే విధంగా డిజైన్ చేస్తాను. స్వర్గీయ ఏఎన్నాఆర్ గారు చేసిన మ్యాజిక్‌ను మళ్లీ చైతన్య రీ క్రియేట్ చేస్తారని నమ్ముతున్నాను. త్వరలో ఆ మ్యాజిక్‌ను చూడబోతున్నాం అని చందూ మొండేటి అన్నారు. ఈ డ్రీమ్ ప్రాజెక్టు గురించి చెప్పగానే అక్కినేని అభిమానులందరూ సంతోషంలో మునిగిపోయారు.
తండేల్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత నాలుగు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 73.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బుక్ మై షోలో ఇప్పటికే 73K టికెట్లను అమ్మారు. ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











