Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ బర్త్ డే.. రేర్ ఫోటోతో చైతూ సర్‌ప్రైజ్ విషెస్!
సమంతతో విడాకుల తర్వాత శోభిత ధూళిపాళను తన జీవితంలోకి ఆహ్వానించారు అక్కినేని నాగచైతన్య. ఆమె తన జీవితంలోకి అడుగుపెట్టగానే తండేల్‌తో భారీ విజయాన్ని అందుకున్నారు చైతూ. తన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లతో దుమ్మురేపాడు. వివాహం జరిగినప్పటికీ పక్కనపెట్టి సినిమా ప్రమోషన్స్ ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. సినిమా రిలీజై హిట్ అందుకున్న తర్వాతే భార్యను తీసుకుని హనీమూన్‌కు వెళ్లాడు నాగచైతన్య. తన భార్య పుట్టినరోజు కావడంతో శోభిత వెరైటీగా విష్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
నాగచైతన్య జీవితంలోకి శోభిత
సమంతతో విడాకుల తర్వాత తమ హీరో ఒంటరిగా మిగిలిపోవాల్సిందేనా? అని చైతన్య గురించి అక్కినేని అభిమానులు బాధపడ్డారు. అయితే చైతూ మాత్రం సైలెంట్‌గా శోభితతో తన ప్రేమాయణం సాగిస్తూ వచ్చాడు. శోభితతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని గతేడాది ఆగస్టులో పెద్ద బాంబు పేల్చాడు చైతన్య. తర్వాత డిసెంబర్‌లో హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో శోభిత - నాగచైతన్యల వివాహం ఘనంగా జరిగింది. అతిరథ మహారథులు వీరి పెళ్లికి తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు.

NC24 షూటింగ్‌లో చైతూ
వివాహం తర్వాత అక్కినేని కోడలి స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు శోభిత. ఫారిన్‌లో హనీమూన్ కంప్లీట్ చేసుకుని వచ్చిన ఈ దంపతులు తర్వాత వారి రోజువారి కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. చైతూ తన 24వ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. విరూపక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై భోగవల్లి ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
శోభిత ప్రెగ్నెన్సీపై గాసిప్స్
శోభిత మాత్రం పెళ్లి తర్వాత కొత్తగా ఏ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. గతేడాది మంకీ మెన్, లవ్ సితార సినిమాలలో ఆమె నటించారు. అయితే భర్తతో కలిసి సినిమా ఈవెంట్స్, ఇతర ఫంక్షన్స్‌లో శోభిత మెరుస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీని అక్కినేని ఫ్యామిలీ కలిసినప్పుడు, ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ 2025లోనూ శోభిత పాల్గొన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ స్టార్ కపుల్స్ ప్రెగ్నెన్సీ న్యూస్ చెబుతున్నారు. కియారా అద్వానీ- సిద్ధార్ మల్హోత్రా, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిలు తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించి అభిమానులను ఖుషి చేశారు. అయితే శోభిత కూడా గర్భం దాల్చినట్లుగా మొన్నామధ్య వార్తలు వచ్చాయి. అయితే ఈ వ్యాఖ్యలను శోభిత టీమ్ ఖండించింది.
శోభితకు చైతూ బర్త్ డే విషెస్
ఇదిలాఉండగా.. మే 31న శోభిత ధూళిపాళ 33వ వసంతంలోకి అడుగుపెట్టారు. దీంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగచైతన్యతో పెళ్లి తర్వాత అక్కినేని వారి కోడలిగా తొలి పుట్టినరోజు కావడంతో శోభితకు ఈరోజు ఎంతో స్పెషల్. ఇక భర్త నాగచైతన్య కూడా తన భార్యకు విభిన్నంగా బర్త్ డే విషెస్ చెప్పారు. శోభితతో గతంలో ఓ ప్రాచీన కట్టడం బ్యాక్‌డ్రాప్‌లో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే మై లేడీ అంటూ విష్ చేశాడు. ఇందులో చైతన్య బ్లాక్ టీషర్ట్, బ్లాక్ కళ్లజోడు పెట్టుకుని రఫ్ గడ్డంతో స్టైలీష్‌గా ఉండగా.. వైట్ కలర్ టాప్‌తో కనిపించింది. ఇది రేర్ ఫోటో కావడంతో ఆన్‌లైన్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











