Sobhita Marriage: పెళ్లికూతురు కాబొతున్న శోభితా..జోరుగా హల్దీ వేడుక పనులు.. నాగచైతన్య మ్యారేజ్ ఎప్పుడంటే?
అక్కినేని వారసుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాల నిశ్చితార్థం అందర్నీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. వారిద్దరూ ప్రేమలో పీకల్లోతూ మునిగిపోయి డేటింగ్‌లో ఉన్నారనే వార్తల మధ్య ఆకస్మాత్తుగా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి వారిద్దరి పెళ్లి చెప్పుడనే విషయం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి పెళ్లి ఎప్పుడు? అనే విషయంపై రకరకాల కథనాలు వినిపించాయి. అయితే తాజాగా శోభితా ధూళిపాల తాను పెళ్లి కూతురు అవుతున్నాననే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఫోటోలు షేర్ చేసి వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే..
నాగచైతన్య, శోభితా ఇద్దరి లవ్ అఫైర్ విషయం ఇంగ్లాండ్‌లో వారిద్దరి వేకేషన్ ద్వారా బయటకు వచ్చింది. అయితే ఎన్నడూ ఇద్దరు తమ ప్రేమ వ్యవహారంపై పెదవి విప్పకుండా మౌనంగానే సమాధానం చెప్పారు. మీడియాలో పలు రకాల ఊహాగానాలు, రూమర్లు, గాసిప్స్ అడ్డు కట్ట వేస్తూ వారిద్దరి డైరెక్టుగా పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకొన్నారు.

ఇదిలా ఉండగా, నిశ్చితార్థం తర్వాత చైతూ, శోభితా కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియలో వైరల్ అయింది. ఎంగేజ్‌మెంట్ తర్వాత వారిద్దరి ఫోటో అంటూ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇద్దరు బ్లాక్ డ్రస్సులో ఓ లిఫ్టులో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలోకి రావడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దాంతో వారిద్దరూ వేకేషన్‌కు వెళ్లారేమో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

అయితే తాజాగా పెళ్లికి ముందు పసుపు దంచే కార్యక్రమంలో శోభితా పాల్గొన్నారు. ఆ ఫోటోలను తన ఇన్సాటాగ్రామ్‌లో పోస్టు చేశారు. దాంతో ఒక్కసారిగా అక్కినేని, దూళిపాల అభిమానులు షాక్ అయ్యారు. మీడియాకు చెప్పకుండా పెళ్లి పనులు మొదలు పెట్టేశారా? అనే విషయం మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఆ ఫోటోలు మాత్రం పెళ్లి త్వరలోనే అనే విషయాన్ని స్పష్టం చేశాయి.

తమ కుటుంబంలో ఉండే ముత్తైదువలందరితో కలిసి చక్కగా, సంప్రదాయంగా పట్టు చీరలో ముస్తాబైన శోభితా చేతిలోని ప్లేటులో పసుపు కొమ్ములను పట్టుకొని కనిపించింది. అొంతేకాకుండా తన పరివారంతో స్వయంగా పసుపు దంచుతుండం మరింత ఆకట్టుకొన్నది. పూజారుల వేద మంత్రాల మధ్య ఈ పసుపు దంచే కార్యక్రమాన్ని శోభిత కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ఆమె పూజలో నిమగ్నమైన ఫోటో కూడా క్రేజీగా మారింది. పూజ తర్వాత పెద్ద ఆశీర్వాదం తీసుకొంటూ పాదాభివందన చేస్తూ శోభిత కనిపించింది.
హిందూ సాంప్రదాయంలో పసుపు దంచడమనేది పెళ్లికి ముందు నిర్వహించే ఆచారం. హల్దీ వేడుక కోసం ఈ కార్యక్రమాన్ని ముత్తైదువలతో కలిసి చేస్తారు. దాంతో త్వరలోనే నాగచైతన్య, శోభిత పెళ్లి అనే విషయం సంచలనంగా మారింది. అయితే ఈ వీరిద్దరి పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అనేది సెన్సేషన్‌గా మారింది.
శోభితా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల పొన్నియన్ సెల్వన్, అలాగే లవ్ సితారా అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన అమెరికన్ చిత్రం మంకీ మ్యాన్ రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది.


Click it and Unblock the Notifications











