Don't Miss!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Sports IPL 2024 సీజన్లో చెలరేగేది ఆ కుర్రాడే: సునీల్ గవాస్కర్
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
గూఢచారి భామకు బంపర్ ఆఫర్.. ఏకంగా మణిరత్నం సినిమాలో..
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం భారీగా సెట్లు వేసి అట్టహాసంగా షూట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం ఇప్పటికే స్టార్ హీరోలు, హీరోయిన్లు నటిస్తుండగా.. మరో క్రేజీ తార శోభితా ధూలిపాళ ఈ ప్రాజెక్టులో చేరారు.
బాలీవుడ్లో రామన్ రాఘవ్ 2.0, కాలకంది, తెలుగులో గూఢచారి చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ భామ తాజాగా పొన్నియన్ సెల్వన్ ప్రాజెక్ట్‌లో భారీ ఆఫర్‌ను కొట్టేసింది. కల్కి కృష్ణమూర్తి అద్భుతమైన నవల ఆధారంగా తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ గతేడాది థాయ్‌లాండ్‌లో మొదలైంది. జయం రవి, కార్తీ హీరోలపై ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షూట్లో జయం రవి, కార్తీ, విక్రమ్, త్రిష, రియాజ్ ఖాన్ తదితరులపై చిత్రీకరిస్తున్నారు.
పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ కూడా ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులో శోభితా ధూలిపాళ చేరడంతో మరింత స్టార్ కళ ఉట్టిపడింది. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్‌గా రవి వర్మన్, మాటల రచయితగా జయ మోహన్, సంగీత దర్శకుడిగా ఏ ఆర్ రెహ్మాన్ వ్యవహరించబోతోన్నారు.
పొన్నియన్ సెల్వన్ చిత్రంలో విక్రమ్‌తో పాటు విజయ్ సేతుపతి, ఐశ్వర్యరాయ్, మోహన్‌బాబు, కార్తి, కీర్తి సురేష్, జయం రవితదితరులు ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు.