పెళ్లికి ముందు ఫస్ట్​ టైమ్ అక్కడ కలిశాం.. ఆ తరువాత పెళ్లి ప్రపోజ్‌.. : శోభిత

Sobhita Dhulipala: టాలీవుడ్ హీరో నాగచైతన్య నటి శోభిత దూళిపాళ్ల ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్ 4న అతి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో శోభిత మెడలో నాగచైతన్య మూడు ముళ్ళు వేశారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే.. పెళ్లయిన తర్వాత తొలిసారి హీరోయిన్ శోభిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది.

హీరోయిన్ శోభిత ధూళిపాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగు అమ్మాయి అయినా ఫ్యాషన్ కెరీర్ పై మక్కువతో తొలుత మోడల్ గా తన కెరీర్ నో ప్రారంభించింది. పలు ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఈ తరుణంలో మంచి పాపులారిటి సంపాదించుకున్న ఈ అమ్మడు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో బాలీవుడ్ లో అడుగు పెట్టింది.వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ తన ప్రతిభను చాటుకుంది. ఈ క్రమంలో హిందీ తెలుగు తమిళం వంటి సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది.

Sobhita Dhulipala Makes Rare Comment About His Love Story With Naga Chaitanya

ఇదిలా ఉంటే హీరోయిన్ సమంతతో విడాకులు అనంతరం నాగచైతన్యకు శోభిత పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమ బంధానికి ఇరువురు కుటుంబాలు సమ్మతించడంతో ఆగస్ట్ 8 న రహస్యంగా ఎంగేజ్మెంట్ చేశారు. అనంతరం సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల చేసి.. సిని లవర్స్ కు షాక్ ఇచ్చారు. తాజాగా మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు నూతన జీవితంలోకి అడుగు పెట్టారు.

తాజాగా శోభిత ధూళిపాళ్ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను మొదటిసారిగా 2018లో నాగార్జున గారి ఇంటికి వెళ్లానని, 2022 ఏప్రిల్ లో నాగచైతన్యతో తనకు పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చింది. అలా తనని ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నానని చెప్పారు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. మేమిద్దరం ఎక్కువగా ఫుడ్‌ గురించే మాట్లాడుకునేవాళ్లం. ఈ సమయంలో నన్ను ఎక్కువగా తెలుగులో మాట్లాడమని నాగ చైతన్య అనే వాడు. అలా తరుచుగా మాట్లాడటం వల్ల ఇద్దరి బంధం మరింత బలపడిందని చెప్పుకొచ్చారు.

Sobhita Dhulipala Makes Rare Comment About His Love Story With Naga Chaitanya

తాను ఎప్పుడూ ఇన్‌స్టాలో యాక్టివ్‌గానే ఉంటాననీ, అయితే.. తాను పెట్టే గ్లామర్‌ ఫొటోలకు కాకుండా ఇన్​స్పిరేషనల్ స్టోరీలకు, అలాగే నా ఒపీనియన్స్​కు సంబంధించిన పోస్ట్‌లను చైతూ లైక్ కొట్టేవాడు. ఈ క్రమంలో ఫస్ట్ మీట్ గురించి మాట్లాడుతూ.. తాము ముంబయిలోని ఓ కేఫ్‌లో ఫస్ట్ టైమ్ చైతూను కలిశామని తెలిపారు. ఆ సమయంలో చైతన్య హైదరాబాద్‌లో, తాను ముంబయిలో ఉండే దాన్ని అని చెప్పుకోచ్చారు. ఈ సమయంలో చైతూ తన నాకోసం హైదరాబాద్‌ నుంచి ముంబయి వచ్చేవాడనీ, ఫస్ట్​ టైమ్​ తామిద్దరం బయటకు వెళ్లే వాళ్లమని అంటూ శోభిత తమ రహాస్యాలను బయటపెట్టింది.

బయటకు వెళ్లినప్పుడు తామిద్దరం హ్యాపీగా గడిపేవారిమనీ, ఒకరికొకరం గోరింటాకు పెట్టుకునే వారిమనీ, ఆ తర్వాత అమెజాన్‌ ప్రైమ్​కు సంబంధించిన ఈవెంట్‌కు వెళ్లామని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలకు నాగచైతన్య తనని పిలిచారనీ, మరుసటి ఏడాదే చైతూ మా ఫ్యామిలీని కలిశారనీ, ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతనే ఈ ఏడాది గోవాలో మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X